Madhubabu : పాముతో ఆటలాడిన మందుబాబు చివరికి ఏమైందంటే
Madhubabu : పుట్టపర్తి జిల్లా కదిరి మండలంలో ఒక మందుబాబు చేసిన పనికి అందరూ అతడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మందు కడుపులో పడితే చాలు ఏం మాట్లాడుతారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. బహిరంగంగా రోడ్లపైనే ఇష్టమైన విధంగా వ్యవహరిస్తారు. దీంతో సామాన్యులు ఇబ్బంది పడిన సందర్భాలు కోకొల్లలు.
బస్సులకు అడ్డం రావడం, బైకులకు అడ్డం రావడం రోడ్డుపైనే తాగి పడిపోవడం అనేకమైన సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారి పిచ్చి మరింత ముదిరిపోతుంది. పుట్టపర్తి జిల్లా కదిరి మండలంలో ఒక యువకుడు ఫుల్లుగా తాగిన మైకంలో నాగుపాముతో ఆటలు ఆడాడు. నాగుపాము బయటకు వచ్చి రోడ్డు మీద ఉన్న సమయంలో దానిని ముట్టడం, దానితో ఆటలు ఆడడం చేశాడు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన పాము అతడిని కాటు వేసింది. అప్పటికే సెల్ ఫోన్ లో కొంతమంది ఈ వీడియోను బంధిస్తూ వద్దని వారిస్తున్న కూడా వారి మాట పెడచెవిన పెట్టాడు. ఏదో పోటుగాడిలా ఏదో సాధిస్తానని పాముతో ఆటలు ఆడగా అది ఒక్కసారి కాటు వేసింది.
దీంతో చేయి పట్టుకొని విలవిల్లాడిపోయాడు. అయినా మందు కడుపులో ఉండడంతో తన వక్రబుద్ధి చూపిస్తూ పాముని తన బూటు కాలుతో తన్నాడు. తొక్కడం చేశాడు. దీంతో అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాక అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారు. పోలీసులకు ఫోన్ చేయాలని కనీసం అంబులెన్స్ అయినా తెప్పించి మందు బాబు ప్రాణాలు కాపాడాలని ప్రయత్నం చేశారు.
చివరకు అంబులెన్స్ తీసుకొచ్చి అతడిని ఆసుపత్రిలో చేర్పించారు దీంతో అతడు ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మందు తాగిన అనంతరం ఇలాంటి మందుబాబులు చేసే దుశ్చర్యల వల్ల ఇతరుల ప్రాణాలకే కాకుండా వారికి కూడా అనేక సమస్యలు ఎదురవుతుంటాయని ఈ సంఘటన నిరూపిస్తుంది. కాబట్టి మందు తాగే ముందు తాగిన తర్వాత అనవసరమైన ఇష్యూస్ కి వెళ్లకుండా ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో, కూడా తెలియని మైకంలో దారుణాలకు తెగబడుతున్నారని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది.
Drunken Antics with Cobra in Kadiri Ends in Hospitalization
In a bizarre and dangerous incident, a young man named Nagaraju from Kadiri in Sathyasai district found himself in the hospital after deciding to play with a cobra while intoxicated.
The drama unfolded near a degree… pic.twitter.com/mjmuBqTAgT
— Sudhakar Udumula (@sudhakarudumula) July 24, 2024