JAISW News Telugu

Modi-Chandrababu : చంద్రబాబుకు ఏమైంది.. మోదీ సభకు రావడం లేదా?

Modi-Chandrababu

Modi-Chandrababu

Modi-Chandrababu : ప్రధాని మోదీ నేడు రాజమండ్రిలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఏపీలో ఎన్నికల వేడి రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఏపీలో మోదీ రెండు రోజులు తన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరికి మద్దతుగా ఇవాళ మోదీ ప్రచారం చేయనున్నారు.

మోదీ ఈ రోజు రానుండగా.. దీనికి చంద్రబాబు నాయుడు హాజరు కావడం లేదు. అదెంటీ ఎందుకు రావడం లేదని చాలా మంది కంగారు పడుతున్నారు. రాజమండ్రి సభకు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ హాజరుకానున్నారు. వీరితో పాటు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అయిదుగురు ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న వారు రానున్నారు. చంద్రబాబు రాజమండ్రి సభకు రావాలంటే ప్లైట్ లో రావాలి.  ప్రధాని మోదీ వచ్చిన తర్వాత అది నో ఫ్లైయింగ్ జోన్ గా మారుతుంది.

దీంతో చంద్రబాబు రాలేకపోతున్నారని అనకాపల్లికి ముందుగానే చేరుకుని ప్రధాని మోదీ నిర్వహించే సభలో పాల్గొంటారని తెలుస్తోంది. అనకాపల్లి లో బీజేపీ నుంచి సీఎం రమేశ్ పోటీ చేస్తుండగా..  ఆయనకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ రోజు రెండు సభల్లో మోదీ ప్రసంగించిన తర్వాత తిరిగి ఆయన మే 8 న  ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ ప్రచారానికి రానున్నారు.

ఈ నెల 8న కలికిరిలో జరిగే సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ కూడా హాజరై తమ ప్రసంగాలు వినిపించనున్నారు. ఆ తర్వాత విజయవాడలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో  రోడ్ షో ఉంటుంది. ఇప్పటికే అమిత్ షా ధర్మవరం వచ్చి జగన్ పై ఆరోపణలు చేయడంతో వైసీపీ వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటు కేంద్రంలోని బీజేపీని నిందించలేరు. దీంతో జగన్ వ్యుహాత్మకంగా బీజేపీ వైఖరిపై మౌనం ప్రదర్శిస్తూ టీడీపీ, జనసేనలే లక్ష్యంగా ఎదురుదాడికి దిగుతున్నారు.

Exit mobile version