JAISW News Telugu

Alcohol : మద్యం తాగేప్పుడు ఏయే ఆహార పదార్థాలు తినాలి? ఏవి తినకూడదో తెలుసా?

Alcohol

Foods to eat with Alcohol

Alcohol : మందు తాగేప్పుడు ఏఏ ఆహార పదార్థాలు తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలు మద్యం ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. మరికొన్ని మీ శరీరానికి మద్యంతో కలిగే నష్టాలను తగ్గిస్తుంది.

అధిక మద్యపానం వల్ల కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్, సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ సంబంధిత వ్యాధులకు సైతం దారితీస్తుంది. అయితే మద్యం తీగేప్పుడు ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి.

ప్రోటీన్..
చేపలు, గుడ్లు, మాంసం, చిక్కుళ్లు వంటి ప్రొటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు మద్యం తాగేప్పుడు తీసుకుంటే మద్యం శోషణను నెమ్మదిస్తాయి, దీని వల్ల త్వరగా మత్తులోకి జారకుండా ఉండిపోతారు.

ఫైబర్..
ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్, కాయగూరలు, బ్రౌన్ రైస్, పండ్లు వంటివి తీసుకుంటే మద్యం శోషణను నెమ్మదిస్తాయి. దీంతో పాటు మద్యంతో కలిగే హ్యాంగోవర్‌ తగ్గించడంలో సాయం చేస్తాయి.

కరివేపాకు..
కరివేపాకు మద్యం వల్ల కలిగే కాలేయ నష్టాన్ని నివారించడంలో ఎక్కువ సాయం చేస్తుంది. ఇది రక్తం కూడా ఇంప్రూవ్ అయ్యేందుకు తోడ్పడుతుంది.

నీరు..
మద్యం తాగుతున్నప్పుడు ఎక్కువ మొత్తంలో  నీటిని తీసుకోవాలి. ఇది డీహైడ్రేషన్‌ నుంచి కాపాడుతుంది. మద్యం తాగిన తర్వాత తలనొప్పి, అలసట, తదితర సమస్యలను నివారిస్తుంది.

మద్యం తాగినప్పుడు తినకూడనివి..

చక్కెర అధికంగా ఉండేవి..
చక్కెర అధికంగా ఉండే క్యాండీ, ఇతర పదార్థాలు, చాక్లెట్, సోడా వంటివి మద్యం ప్రభావాన్ని మరింత పెంచుతుంది.

కారంగా ఉండేవి..
కారంగా ఉండే పదార్థాలు తీసుకుంటే కడుపులో చికాకు కలుగుతుంది. మద్యంతో కారంగా ఉండేవి తీసుకున్నప్పడు కడుపు నొప్పి, వికారం, వాంతుల ప్రమాదం పెంచుతాయి.

కెఫిన్..
కాఫీ, టీ వంటి పానీయాలలో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇవి మద్యం ప్రభావాలను తీవ్రతరం చేస్తాయి. నిద్రలేమికి దారితీస్తాయి.

ఉప్పుతో కూడుకున్నవి..
ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, ప్రెట్జెల్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి. మద్యం వల్ల కలిగే హ్యాంగోవర్‌ను తీవ్ర తరం చేస్తాయి.

Exit mobile version