Viral Tweet : ఆ ట్వీట్ అర్థమేంటి.. సన్ రైజర్స్ ఓడితే ఆ పార్టీ ఓడిపోయినట్లేనా ?

Viral Tweet

Viral Tweet

Viral Tweet : ఐపీఎల్ 2024 పోరు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలసిందే. అందులో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. క్వాలిఫయర్ 1లో చతికిలపడింది. టేబుల్ టాపర్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే డెరెక్టుగా ఫైనల్స్ చేరే దశలో చేతులెత్తేసింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు సమష్టిగా ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలం అయ్యారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ సన్ రైజర్స్ 19.3 మూడు ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ ఈ స్కోర్‌ను అలవోకగా కొట్టేసింది. దీంతో ఫైనల్స్‌లో బెర్త్ కన్ఫాం చేసుకుంది.

ఫైనల్స్ ఎంట్రీ ఇవ్వాల్సిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటర్లు విఫలం అయ్యారు. ట్రావిస్ హెడ్ డకౌట్‌తో వికెట్ల పతనం స్టార్ట్ అయింది. అభిషేక్ శర్మ-3, నితీష్ కుమార్ రెడ్డి- 9, షాబాజ్ అహ్మద్- 0, అబ్దుల్ సమద్- 16, సన్వీర్ సింగ్-0, భువనేశ్వర్ కుమార్- 0లకే అవుట్ అయ్యారు. టాప్ ఆర్డర్‌లో రాహుల్ త్రిపాఠి- 55, మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్- 32, చివర్లో కేప్టెన్ పాట్ కమ్మిన్స్- 30 పరుగులతో కొంత వరకు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఫైనల్స్‌లో అడుగు పెట్టడానికి సన్‌రైజర్స్ కు మరో ఛాన్స్ ఉంది. నేడు జరిగే ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే.. హైదరాబాద్ టీమ్ ఫైనల్స్‌లో అడుగుపెడుతుంది. కేకేఆర్‌తో ఈ సారి ఫైనల్లో తలపడుతుంది.

 మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా- ఈ క్వాలిఫయర్ 1ను ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో ముడిపెడుతూ ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ వైరల్‌ అవుతోంది. సన్‌రైజర్స్  గెలిస్తే- టీడీపీ గెలిచినట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించితే వైసీపీ గెలిచనట్టవుతుందంటూ ఓ ట్వీట్ చేశారు. క్వాలిఫయర్ 1 ప్రారంభం కావడానికి ముందు హను అనే ట్విట్టర్ యూజర్ దీన్ని పోస్ట్ చేశారు. టీడీపీ అభిమానిగా భావిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఆయన పలు పోస్ట్‌లు పెట్టడమే ఇందుకు నిదర్శనం. తీరా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ ఓడిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ట్వీట్ ప్రకారం.. ఎస్ఆర్ హెచ్ ఓడినందున ఇక టీడీపీ సైతం ఓడుతుందని వైసీపీ అభిమానులు కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. కాగా,  వ్యక్తిగతంగా ఎవరో ఒకరు ఏవో ట్వీట్ లు పెడుతుంటారు..అలాంటివి పట్టించుకోవడం అనవసరమని కొందరంటున్నారు.

TAGS