OTT : ప్రస్తుతం కంటెంట్ విషయంలో ఓటీటీ ఏమనుకుంటోంది? ఇప్పుడు ఆ తరహా సినిమాలకు డిమాండ్ పెరగబోతోందా?

OTT

OTT

OTT : చిత్ర పరిశ్రమను రెండు భాగాలుగా విభజిస్తే కొవిడ్ కు ముందు.. కొవిడ్ తర్వాతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. కొవిడ్ కు ముందు ఓటీటీలు ఉన్నా.. పెద్దగా ప్రాచుర్యం లేదు. ఇక కొవిడ్ కాలంలో ఇంట్లో ఖాళీగా కూర్చున్న వారికి ఎంటర్ టైన్ మెంట్ కోసం ఓటీటీలే దిక్కయ్యాయి. దీంతో అవి ప్రస్తుతం వ్యక్తుల జీవితంలో ఒక భాగంగా మారాయంటే అతిశయోక్తి కాదు.

చిత్ర పరిశ్రమ సంప్రదాయంగా కళాత్మక, వాణిజ్య లక్ష్యాలతో కంటెంట్  సృష్టించేది. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పెరుగుదల తర్వాత ఈ బ్యాలెన్స్ ను మార్చి.. క్వాలిటీ నుంచి శీఘ్ర లాభాల వైపునకు దృష్టి మళ్లించాయి.

ఒక స్టార్ నటుడిని తీసుకురావడం, రూ.50 కోట్లకు సినిమా తీయడం, ఓటీటీ హక్కుల (డిజిటల్ రైట్స్)ను అంతే మొత్తానికి అమ్మడం. ఇక థియేట్రికల్ ఆదాయంలో వచ్చే అదనపు మొత్తాన్ని లాభంగా చూడడం నిర్మాతలకు, దర్శకులకు, ఇంకొంత లోతుకు వెళ్తే.. హీరోలకు కూడా ఫార్ములాగా మారిపోయింది. నాన్ థియేట్రికల్ అమ్మకాల ద్వారా ఖర్చులు వస్తే చాలని చాలా మంది ప్రొడ్యూసర్లు ముందే అంచనాలు వేసుకుంటున్నారు. ఒక వేళ డిజిటల్ రైట్స్ లో ఖర్చులు కూడా రాకుంటే ఆ సినిమాను చేసేందుకు ఇంట్రస్ట్ చూపడం లేదు.

గతంలో కళాత్మక వారసత్వంతో సినిమాలు తీసేవారు. కానీ, నేడు సినిమాలు ఫాస్ట్ ఫుడ్ లాగా మారిపోయాయి. తక్కువ సమయంలోనే వేగంగా షూటింగ్ పూర్తి చేసి, ఓటీటీలో రిలీజ్ చేసి డిజిటల్ హక్కుల ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నారు. దీంతో సినిమా క్వాలిటీ రాను రాను గణనీయంగా పడిపోతోంది. ప్రజలకు ఏదైనా ఉచితంగా అందితే.. వారు దానికి విలువ ఇవ్వరు. ఒక సినిమా థియేటర్ల నుంచి కనీసం రూ.10 కోట్ల షేర్ రాబట్టి లాభాలను ఆర్జించగలదు. కాబట్టి నిర్మాతలు తరచూ సాధారణ చిత్రాలను ఎంచుకున్నారు.

ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇప్పుడు కఠినంగా మారి సినిమాలకు చెల్లించే ధరలను భారీగా తగ్గించాయి. ఒకప్పుడు రూ.50 కోట్లు తెచ్చిపెట్టిన సినిమాలు ఇప్పుడు రూ.30 కోట్లు మాత్రమే రాబడుతుండడంతో నిర్మాతలు అప్రమత్తం అవుతున్నారు. రిస్క్ బాధ్యతను ఎలా ప్రభావితం చేస్తుందో, ఈ కాన్సెప్ట్ సినిమా ఇండస్ట్రీకి ఎలా వర్తిస్తుందో. ఈ మార్పు నిర్మాతలు తమ వైఖరిని పరిశీలించుకునేలా చేస్తోంది. ఫైనాన్షియల్ రిస్క్ లు తెరపైకి రావడంతో, మెరుగైన స్క్రిప్ట్ లను డెవలప్ చేయడం. బడ్జెట్ నిర్వహణనపై దృష్టి పెడుతున్నారు.

పరిశ్రమ సృజనాత్మకత, నాణ్యతపై దృష్టి పెట్టేందుకు ఒక అవకాశం కావచ్చు, ఇది మంచి, జీవం ఉన్న సినిమాల పునరుజ్జీవనానికి దారి తీస్తుంది. వేగంగా లాభాలు రావడం పరిశ్రమకు మంచిదే కావచ్చు.. ఫైనాన్షియల్ రిస్క్ పెరగడంతో నిర్మాతలు లాభదాయకంగానే కాకుండా విలువైన సినిమాలు చేసేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

TAGS