Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’ టికెట్ ధర పెంపుపై ఏమంటున్నారంటే?

Kalki 2898 AD

Kalki 2898 AD

Kalki 2898 AD : ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కల్కి 2898 ఏడీ’ అడ్వాన్స్ బుకింగ్ దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్సాహం ఆకాశాన్నంటుతుండగా, తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచడంతో పాటు సినిమా అదనపు ప్రదర్శనకు పరిమిషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మొదటి రోజు ఉదయం 5:30 గంటలకు రూ.200 అదనపు రేటుతో స్పెషల్ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో జూన్ 27 నుంచి జూలై 4వ తేదీ వరకు మొదటి 8 రోజులు 5 షోలు ప్రదర్శించుకునేందుకు నిర్మాతలు అనుమతిచ్చారు. ముందస్తు స్క్రీనింగ్ పై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు తెలంగాణ ప్రభుత్వం పెంచిన టికెట్ ధరలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ విషయాన్ని నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఎక్స్ లో ధృవీకరించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లలో రెగ్యులర్ షోలకు రూ.100 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంత ఎక్కువ టికెట్ రేట్లు ఉండడంతో కలెక్షన్ల పరంగా వారంలోనే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ ధరల ప్రభావంపై పలువురు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇది సరైన విధానమేనా అని కొందరు ప్రశ్నించారు. మరి కొందరైతే పైరసీ గురించి ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలు చట్టవిరుద్ధమైన వెబ్ సైట్ల నుంచి సినిమాను డౌన్ లోడ్ చేసుకునేందుకు దారితీస్తాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించేందుకు ప్రభాస్ కు రూ.80 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. హిందూ గ్రంథాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా పోస్ట్ అపోకలిప్టిక్ ప్రపంచంలో సాగుతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్న డ భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుంది.

ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తో పాటు దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, పశుపతి, సస్వతా ఛటర్జీ, అన్నా బెన్, చెంబన్ వినోద్ జోస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

TAGS