JAISW News Telugu

Actress Glamour Roles : ఏంటీ నేను గ్లామర్ రోల్స్ చేయకూడదా అంటున్న నటి ఎవరో తెలుసా?

Actress Glamour Roles

Actress Glamour Roles : ముద్దులొలికే ఈ చిన్నారి హిరోయిన్ గా  మారి.. గ్లామర్ పాత్రలు చేయడానికి సై అంటోంది. అయితే మొన్నటి వరకు ఎలాంటి ఎక్స్ ఫోజింగ్ లేకుండా హోమ్లీ క్యారెక్టర్స్ చేసిన ఈ చిన్నది ఇప్పుడు కాస్త గ్లామర్ డోస్ పెంచుతానంటోంది. అయితే తెలుగుతో పాటు మిగతా లాంగ్వేజ్ ల్లో కూడా ఈ చిన్నది అందరికీ పరిచయమే. ఫై ఫొటోలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మడు ఒకే ఒక్క సీరియల్ తో అందరికీ తెలిసిపోయింది.

తర్వాత తెలుగులో మూడు నాలుగు చిత్రాల్లో నటించింది. కానీ అవి పెద్ద హిట్ కొట్టలేకపోయాయి. దీంతో గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధపడుతోంది. అసలు ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదూ.. చిన్నారి పెళ్లికూతురుగా ప్రతి తెలుగింట్లో పరిచయం అక్కర్లేని అవికా గోర్.. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో కీలక రోల్ లో నటించి అందరికీ సుపరిచితురాలైంది.

హిరోయిన్ గా తెలుగులో ఉయ్యాలా జంపాలా మూవీలో ఒక సూపర్ డూపర్ క్యూట్ గర్ల్ క్యారెక్టర్ లో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మామా, రాజుగారి గది 3 లాంటి మూవీస్ లో నటించిన అవికా గోర్…  ఆ మూవీస్ అంత పెద్దగా ఆడకపోవడంతో లక్ కలిసి రాలేదు. దీంతో అవికా గోర్ సొంత నిర్మాణ సంస్థ ను పెట్టి ఒక సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఈమె తీసిన సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ సినిమాల బాట పట్టాలని అనుకుంటోంది.

ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన వధువు వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇది హట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఎక్కువగా సినిమాలు లేకున్నా.. సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతూ ప్రేక్షకులు తనని మరిచిపోకుండా చూసుకుంటుంది. బ్లాక్ డ్రెస్ లో ఆమె పెట్టిన పోస్టు కాస్త బోల్డ్ గా ఉండడంతో కుర్రకారు తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ నార్త్ ఇండియా బ్యూటీకి ఇలాంటి ఫిక్స్ పోస్టు చేయడం వల్ల మళ్లీ ఏమైనా అవకాశాలు వస్తాయా? ఇన్ స్టాలో నే గ్లామర్ ఫిక్స్ పెడుతున్నా.. ఈ బ్యూటీ సినిమాల్లో ఇంకాస్త డోస్ పెంచేందుకు కూడా అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆఫర్లు రావడమే లేట్ అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Exit mobile version