Hanu-Man Team : ‘హను-మాన్’ టీంతో యోగి.. ఏం మాట్లాడారంటే?
Hanu-Man Team : ‘హను-మాన్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, కథానాయకుడు తేజ సజ్జా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ తో ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. యువ ప్రేక్షకుల్లో సినిమా ప్రభావం, భారతీయ ఇతిహాసాల (చరిత్ర) అంశాలను ఆకట్టుకునే సూపర్ హీరో కథనంలో ఎలా విజయవంతం అయ్యిందో చర్చించారు.
యోగిని కలవడం నిజంగా తనకు దక్కిన గౌరవంగా వర్మ అన్నారు. ఆయన మాట్లాడుతూ కథ, కథనం గురించి ఆయన తెలుసుకున్నారని, సినిమాను ఆయన అభినందించారన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి సినిమాలు ఎలా ఉపయోగపడతాయో ఆయన మాతో చర్చించారు. సినిమాల్లో సంప్రదాయం, సృజనాత్మకత కలయికకు విలువనిచ్చే నాయకుడు ఉండడం, కొత్త పుంతలు తొక్కడానికి మమ్మల్ని ప్రేరేపించడం హర్షణీయం’ అన్నారు.
ఈ చిత్రంలో సూపర్ హీరో పాత్ర పోషిస్తున్న నటుడు తేజ సజ్జా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన అనంతరం కృతజ్ఞతలు తెలిపారు.
యోగిని కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, ‘హను-మాన్’ గురించి, మన సంస్కృతిపై దాని ప్రభావం గురించి చర్చించడం ఎంతో గర్వకారణం అన్నారు. ‘హను-మన్’లో నటించడం ఓ చాలెంజ్ తో పాటు గౌరవంగా కూడా అనిపించింది’ అన్నారు.
సూపర్ హీరో చిత్రంగా మొదలైన ‘హను-మన్’ సంప్రదాయ సూపర్ హీరో చిత్రాలకు భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. అభిరుచితో నడిచే ప్రశాంత్ వర్మ భారతదేశపు మొదటి స్వదేశీ సూపర్ హీరోను సృష్టించాడు. ఈ పాత్ర దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంది.
ఈ చిత్రం భారతీయ గ్రంథాలు, పురాణాల గొప్ప వైశాల్యాన్ని అన్వేషించడానికి ప్రేక్షకులకు ఒక ప్రవేశ ద్వారంగా మారింది. ఆర్‌కేడీ స్టూడియోస్ సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ (నిరంజన్ రెడ్డి) నిర్మించిన చిత్రం ‘హను-మాన్’. వెంకట్ కుమార్ జెట్టి ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్.