Prabhas Kalki : ఇప్పటి వరకు సినిమా కల్కి 2898 AD సినిమాకు హైప్, ప్రమోషన్ అంతా ప్రభాస్ తోనే. కానీ సినిమాలో మాత్రం అది కనిపించ లేదు. సినిమాలో స్టార్ కాస్టింగ్ ఎక్కువైనా కనిపించేది తక్కువే. మృణాళ్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, ఎస్ఎస్ రాజమౌళి, రాంగోపాల్ వర్మ, రాజేంద్రప్రసాద్. వీళ్లంతా ఉన్నా కనిపించేది కొద్దిసేపే. రాజమౌళి, రాంగోపాల్ వర్మ కనిపించేది కొద్ది సేపే అయినా సినిమా జోష్ పెంచారు. ఆర్జీవీ లాంటి టిపికల్ డైరెక్టర్ ను ఒప్పించడం అంత తేలిక కాదు. గతంలో పలు ఇంటర్వ్యూలలో ఆర్జీవీ ని మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే దానంత పనికిమాలిన పని ఇంకోటి చేయనని చెప్పాడు. అలాంటి ఆర్జీవీని ఏం మాయచేశాడో గానీ ఒప్పేసుకున్నాడు.
పెదవి విరుస్తున్న డార్లింగ్ అభిమానులు..
కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పై అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. సినిమా మొదలయ్యాక దాదాపు అరగంట తర్వాత ప్రభాస్ భైరవ క్యారెక్టర్ ఎంటరవుతుంది. అప్పటి దాకా హీరో కనిపించడు. ఆ తర్వాత మిగతా కథ నడుస్తుందే తప్ప ప్రభాస్ కు పెద్దగా స్ర్కీన్ స్పేస్ లేదు. ఇక అమితాబ్ సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకున్నాడు. 75 ప్లస్ ఏజ్ లోనూ అమితాబ్ ఎనర్జీ అమోఘం. సినిమాకు ప్రధాన బలం బిగ్ బీనే. సెకండాఫ్ లో ప్రభాస్, అమితాబ్ లో మీద తీసిన యాక్షన్ సీక్వెన్స్ ఎక్సాట్రార్డినరీ. ప్రభాస్ లాంటి స్టార్ హీరో.. అమితాబ్ లాంటి గొప్ప నటుడితో ఫైట్ చేయిస్తే ప్రేక్షకులు మెచ్చేలా చేయడంలో వందకు వందశాతం సక్సెస్ అయ్యాడు నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడు. అమితాబ్ లాంటి గొప్ప నటుడిని ఇప్పటి హీరో కొడితే సగటు ప్రేక్షకుడికి రుచించదు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఇక్కడ ఆ తప్పు చేయలేదు. ఏ ఒక్కరినీ తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేయగలిగాడు. ఇది నాగ్ అశ్విన్ ప్రతిభకు నిదర్శనం. అటు గొప్ప నటుడిని, ఇటు పాన్ ఇండియా స్టార్ హీరోతో ఒకరికొకరు తలపడడం, దానిని బ్యాలెన్స్ చేయడం నిజంగా డైరెక్టర్ కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇక్కడ హీరో కోసమో, లేక గొప్ప నటుడి కోసమే రాజీ పడితే సినిమా డిజాస్టర్ గా నిలిచేది.
సెకండాఫ్ లో ప్రభాస్ ఫైట్ సీన్లకే పరిమితమయ్యాడు. మహాభారతంలో కర్ణుడిగా ప్రభాస్ క్లైమాక్స్ లో కనిపించే కొద్ది క్షణాలే అయినా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. కర్ణుడి అవతారంలో ప్రభాస్ చాలా చక్కగా ఒదిగిపోయాడు. ఈ క్యారెక్టర్ ఇంకాస్త ఉంటే బాగుండు అని సగటు ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. ప్రభాస్ కు స్క్రీన్ స్పేస్ తక్కువ చేసిన డైరెక్టర్ కనీసం ఈ కర్ణుడి క్యారెక్టర్ లో ఇంకొంచెం పెంచితే బాగుండు అని అభిమానులు కోరుతున్నారు. మరి పార్ట్ -2 లో ఈ కర్ణుడి క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూపెడితే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం.