PM Modi : చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవితో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వెళ్లే సమయంలో పవన్ కల్యాణ్ చిరంజీవిని పరిచయం చేశారు. అయితే పవన్ కల్యాణ్ చిరంజీవిని పరిచయం చేసిన తర్వాత ఇద్దరితో కలిసి చేతులు పైకెత్తి అభివాదం చేశారు. తర్వాత చిరంజీవితో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. కానీ ఏం మాట్లాడారు ఏమో ఇప్పటి వరకు ఎవరికీ తెలిదు.
ప్రధాని మోదీ తమ తో ఏం మాట్లాడారో చిరంజీవి రివీల్ చేశారు. పవన్ గెలిచి ఇంటికి వెళ్లిన తర్వాత మీ ఇంటి వద్ద ఆయనకు స్వాగతం పలికిన తీరు నచ్చిందన్నారు. ఇలాంటి ఉమ్మడి కుటుంబం, సంస్కృతి, సంప్రదాయాలు ఇంకా కొనసాగిస్తున్నందుకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. కుటుంబ జీవన విధానం సమాజంలో ఎంతో అవసరమని అన్నారు. దీంతో నేను ఆశ్చర్యపోయానని చిరు చెప్పారు. ఒక ప్రధాని గా ఇంతటి సునిశిత దృష్టి ఎలా సాధ్యమయ్యిందో నాకు అర్థం కావడం లేదని చిరంజీవి అన్నారు.
పవన్, చిరు మోదీ కలయిక ను చూసి జనసేన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. జనం కోసం పవన్ కల్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టి 2029 లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఆయన విజయం సాధించలేడని ఎప్పటికీ ఆయన వల్ల సాధ్యం కాదని వైసీపీ నేతలు దారుణంగా విమర్శించారు.
జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఇలా పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన పార్టీ దేశ చరిత్రలో ఎక్కడా లేదని ప్రచారం జరుగుతోంది. జనసేన 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే మొత్తం అన్ని చోట్ల విజయం సాధించింది.