JAISW News Telugu

Urmila-Mosin : ఊర్మిళ-మోసిన్ విడాకులకు కారణం ఏదై ఉండవచ్చు..?

Urmila-Mosin

Urmila-Mosin

Urmila-Mosin : ‘రంగీలా’, ‘సత్య’, ‘భూత్’ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళ మటోండ్కర్ ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత తన భర్త మోసిన్ అక్తర్ మీర్ నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. విడాకులకు కారణాలపై ప్రస్తుతం ఇంటర్నెట్ లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఊర్మిళ, మోసిన్ మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం కూడా కారణం కావచ్చు, ఎందుకంటే ఊర్మిళ కంటే మోసిన్ 10 సంవత్సరాలు చిన్నవాడు. చాలా ఆలస్యంగా 40 ఏల్ల వయస్సులో ఊర్మిళ వివాహం చేసుకుంది. చాలా సందర్భాల్లో ఒక నిర్దిష్ట వయస్సు దాటిన తర్వాత వివాహం చేసుకుంటే పిల్లలు పుట్టడంలో సమస్యలు ఏర్పడవచ్చు. దీంతో భర్త వైపు నుంచి వచ్చే డిమాండ్ నేపథ్యంలో విడాకులకు దారి తీయవచ్చు.

అయితే, ఆర్థిక విషయాల్లో తలెత్తిన తగాదాలు వీరి బంధాన్ని దెబ్బతీశాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కంటెంట్ అగ్రిగేషన్ ప్లాట్ ఫామ్ రెడిట్ లో ఒక యూజర్ మోసిన్, ఆమె కుటుంబం తమ వ్యాపారం కోసం తన ఆస్తిని అమ్మమని నటిని బలవంతం చేస్తున్నారని రాశారు. నాలుగు నెలల క్రితం ఊర్మిళ విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇవి మ్యూచివల్ కావని మీడియా కథనాలు చెబుతున్నాయి.

కశ్మీర్ కు చెందిన వ్యాపారవేత్త, మోడల్ మోసిన్ ‘లక్ బై ఛాన్స్’, ‘బీఏ పాస్’, ‘ముంబై మస్త్ కల్లందర్ ’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా మేనకోడలు అయిన ఊర్మళ 2014లో జరిగిన పెళ్లిలో మోసిన్ ను తొలిసారిగా కలిసింది. మోసిన్ కు తొలిచూపులోనే లవ్ చేస్తున్నానని ఊర్మిళ చెప్పింది. వాస్తవానికి, 2016 లో వీరు వివాహం చేసుకున్నప్పుడు వారి సన్నిహిత వివాహానికి హాజరైన అతికొద్ది మంది ప్రముఖుల్లో మనీష్ కూడా ఉన్నాడు.

Exit mobile version