High Court : కుక్కలు దాడులు చేస్తుంటే మీరేం చేస్తున్నారు..ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్!

High Court

High Court Serious on Dog attacks

High Court :  తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇటీవల వీధికుక్కల దాడులు ఎక్కువయ్యాయి. ఇస్నాపూర్‌లో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన మరువకముందే.. జవహర్ నగర్‌లో మరో చిన్నారిపై వీధికుక్కల దాడి జరిగింది. రాష్ట్రంలో రోజుకు సగటున 70 మంది కుక్కల కాటుకు గురవుతున్నారు. మీడియా కథనాల ప్రకారం, ఏడు నెలల్లో వీధికుక్కల దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీధికుక్కల దాడికి సంబంధించిన వార్తలు నిత్యం వస్తుండటంతో హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఈ విచారణ సందర్భంగా వీధికుక్కల దాడులను నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధికుక్కలు ఉన్నాయని అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. కుక్కల దాడి ఘటనల నివారణకు రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లోని ఆరు కేంద్రాల్లో కుక్కలకు స్టెరిలైజేషన్‌ చేస్తున్నామని వివరించారు. ఒక్కో కేంద్రంలో రోజుకు దాదాపు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు.

అయితే స్టెరిలైజేషన్ ద్వారా దాడులను ఎలా ఆపుతారంటూ అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వాటిని షెల్టర్‌హోమ్‌లకు తరలిస్తే సమస్య పరిష్కారమవుతుందని జంతు సంరక్షణ సంఘం తరపు న్యాయవాది వివరించారు. నాగ్‌పూర్‌లోని షెల్టర్ హోమ్‌లలో దాదాపు 90,000 కుక్కలను ఉంచినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో జంతు సంరక్షణ సంఘం సభ్యులు సమావేశమై పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా హైకోర్టు సూచించింది.

కుక్కల దాడులను అరికట్టేందుకు స్టేట్ లెవెల్ కమిటీ: హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బుధవారం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. కుక్కల దాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గాయపడినవారు వందల సంఖ్యలో ఉన్నారు. అయితే, కుక్కల దాడులు అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కొందరు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది.

వీధి కుక్కల దాడి ఘటనలను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కుక్కల దాడులను నివారించేందుకు స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. హైదరాబాదులో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని చెప్పారు. అయితే, స్టెరిలైజేషన్ ద్వారా ఎలా దాడి ఘటనలను ఆపుతారని హైకోర్టు ప్రశ్నించగా.. షెల్టర్ హోమ్స్ కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయి పరిష్కారం చూపాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

TAGS