JAISW News Telugu

Ticket rates : సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ఈ రేంజ్ టికెట్ రేట్స్ ఉన్నాయేంటి..?

Ticket rates

Ticket rates

Ticket rates : సంక్రాంతి వచ్చిందంటే చాలు సినిమా ఇండస్ట్రీ కి పండగే. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు వచ్చే సీజన్ ఇది. కుటుంబ సమేతంగా ప్రేక్షకులు సంక్రాంతికి వచ్చి సినిమాలను చూడాలని కోరుకుంటారు. ఏ సీజన్ కి లేనంత ప్రత్యేకత, ఈ సంక్రాంతి సీజన్ కి ఉంటుంది. అలాంటి బిజినెస్ జరిగే సీజన్ ఇది.

ప్రతీ సంక్రాంతికి కనీసం రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ ఈసారి కేవలం ఒక్క స్టార్ హీరో సినిమా, ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి.

రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా తర్వాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కూడా మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. అదే విధంగా బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ చిత్రానికి కేవలం నందమూరి అభిమానుల్లోనే క్రేజ్ ఉంది.

ఆడియన్స్ మాత్రం ఎక్కువగా రామ్ చరణ్, వెంకటేష్ సినెమాలవైపే ప్రస్తుతం ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మూడు సినిమాలకు టికెట్ రేట్స్ ఆంధ్ర ప్రదేశ్ లో ఏ రేంజ్ లో ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోతారు. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి అన్ని ప్రాంతాలలో బెనిఫిట్ షోస్ ని ఏర్పాటు చేసారు. ఈ బెనిఫిట్ షోస్ కి టికెట్ రేట్స్ 600 రూపాయలకు పైగా ఉంటుందని టాక్.

అదే విధంగా రెగ్యులర్ షోస్ లో సింగల్ స్క్రీన్స్ కి ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ మీద 135 రూపాయిలు అదనంగా ఉండే అవకాశం ఉండగా, మల్టీప్లెక్స్ షోస్ కి 175 రూపాయలకు పైగా పెంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. అంటే సింగల్ స్క్రీన్స్ టికెట్ రేట్స్ 280 రూపాయిలు, మల్టీప్లెక్స్ టికెట్ రేట్స్ 350 రూపాయిలు ఉండబోతుంది అన్నమాట. ఫ్యామిలీ లో 5 మంది తో కలిసి ఈ సినిమాకి వెళ్తే 1700 రూపాయిలు ఖర్చు అవుతుంది.

అదే డాకు మహారాజ్ టికెట్ రేట్స్ విషయానికి వస్తే బెనిఫిట్ షోస్ కి 500 రూపాయిలు, సింగల్ స్క్రీన్స్ కి 255 రూపాయిలు, మల్టీ ప్లెక్స్ థియేటర్స్ కి 310 రూపాయిల టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి. ‘గేమ్ చేంజర్’ అంటే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం కాబట్టి ఆ రేంజ్ టికెట్ రేట్స్ పెట్టుకోవడంలో న్యాయం ఉంది, కానీ మామూలు కమర్షియల్ సినిమా అయినటువంటి ‘డాకు మహారాజ్’ కి అంత టికెట్ రేట్స్ అవసరమా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

అదే విధంగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి మాత్రం సాధారణమైన టికెట్ రేట్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సింగల్ స్క్రీన్స్ లో ఈ సినిమాకి టికెట్ రేట్స్ 220 రూపాయిలు ఉండే అవకాశం ఉండగా, మల్టీప్లెక్స్ థియేటర్స్ కి 275 రూపాయిల టికెట్ రేట్స్ ఉండబోతుంది. ఈ మూడు సినిమాలకు టికెట్ రేట్స్ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు, ప్రభుత్వం నుండి అనుమతి రావాల్సి ఉంది.

Exit mobile version