Nominations : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లోకసభ,అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగబోతున్నాయి.బిజెపి,తెలుగుదే
నామినేషన్ వేసిన ప్రముఖులు ..
ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్, శర్మల,జగన్ మరోవైపు నామినేషన్ కార్యక్రమాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు 70 శాతం పైబడి నామినేషన్ వేయడం పూర్తయింది.
ఈనెల 25 నామినేషన్ పాత్రలను సమర్పించడానికి చివరితేది కావడంతో ఉన్న రెండు రోజులను సద్వినియోగం చేసుకోడానికి అభ్యర్థులు ప్రయత్నాలుక్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి నామినేషన్ అట్టహాసంగా వేశారు. అందులో తన ఆస్తులను పొందుపరిచారు. అదేవిదంగా ఆయన కుమారుడు,పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి బరిలో నిలిచి నామినేషన్ వేసాడు. అయన కూడా తన ఆస్తులు,అప్పులను అఫిడవిట్ ద్వారా ఎన్నికల కమిషన్ కు అందజేశాడు. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగారు. ఆమె కూడా తన ఆస్తులు,అప్పులు అఫిడవిట్లో తెలిపారు.
వైసిపి అధినేత జగన్ తన కంచుకోట స్థానమయిన పులివెందుల నుంచే పోటీచేస్తున్నారు. ఆయన కూడా తన ఆస్తులు,పెట్టుబడులు, ఆదాయం,అప్పులను కూడా అఫిడవిట్ లో పొందుపరిచారు.
పవన్ కళ్యాణ్ ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని నిలుపోకోవాలని భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. 2019లో భీమవరం,గాజువాక స్థానాల నుంచి పోటీ చేశారు. దురదృష్టవశాత్తు రెండు స్తనాలనుంచి పవన్ కళ్యాణ్ ఓటమిపాలయ్యారు.
తాజా ఎన్నికల్లో పవన్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.ఆయన గెలుపు కోసం జనసేన తోపాటు తెలుగుదేశం,బిజెపి శ్రేణులు పనిచేస్తున్నారు.నామినేషన్ కు మరో రెండు రోజులు సమయం ఉండటంతో పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. తన నామినేషన్ అఫిడవిట్ లో 2019 లో ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ చూపిస్తారా ? ఎక్కువ ఆస్తులు చూపిస్తారా అనేది ఆయన అభిమానులు,పార్టీ శ్రేణులు అతృతతో ఉన్నారు. అదేవిదంగా ఇటీవల ఆయన అన్నయ్య,ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఐదు కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు.వీటితోపాటు అప్పులు ఎన్ని,ప్రతి ఈటా వచ్చే ఆదాయం ఎంత అనేది తన అఫిడవిట్లో చూపించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.