Walking Benefits : భోజనం చేశాక కాసేపు నడిస్తే ఈ ప్రయోజనాలుంటాయి?

Walking Benefits

Walking After Having Food

Walking Benefits : శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే ఆహారం తీసుకోవాల్సిందే. అయితే చాలా మంది ఆహారం తీసుకోవడం ఒక మొక్కుబడిగా భావిస్తారు. అలా తీసుకుంటే ఆ ఆహారం శరీరాన్ని నిలబెట్టడంలో ఉపయోగపడదని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తీసుకోవాలని చెప్తున్నారు. ఇలా చేస్తే ఆహారం త్వరగా జీర్ణం కావడంతో పాటు శరీరానికి పోషకాలను అందిస్తుంది.

ఆహారం తీసుకున్నాక చాలా మంది పాటించే కొన్ని పద్ధతుల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి గురించి సరైన అవగాహన లేక పాటిస్తుంటారు. ఆహారం తీసుకున్నాక కూర్చోవడం, పడుకోవడం కంటే ఇలా చేస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రం, వైద్యులు కూడా సూచిస్తున్నారు. దీని ద్వారా శరీరానికి అధిక మేలు జరుగుతుంది.

మనలో చాలా మంది భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చొని ఉండిపోతారు. రాత్రి డిన్నర్ చేశాక కాసేపు కూర్చొని ఫోను చూసుకుంటూ నిద్రపోవడానికి సిద్ధమవుతారు. అయితే భోజనం చేశాక కాసేపు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. భోజనం చేసిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత 15 నుంచి 30 నిమిషాలు నడిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.

* తిన్న తర్వాత నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండెల్లో మంట, ఉబ్బరం, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
* ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారు భోజనం చేశాక నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
* తిన్న తర్వాత నడిస్తే కేలరీలు బర్న్ అయ్యి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

* మానసిక ఆరోగ్యం, గుండె ఆరోగ్యం బాగుంటుంది. కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
* డిన్నర్ తర్వాత కాసేపు నడకతో నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
* అయితే ఈ నడక మరీ వేగంగా ఉండద్దు. నెమ్మదిగా నడుస్తుండాలి. ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే నడక ముగించాలి. 

TAGS