Lakshadweep : మనదేశంలో కూడా సుందరమైన పర్యాటక ప్రదేశాలు కోకొల్లలు. కానీ మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లి వారికి బోలెడు డబ్బులు ధారపోస్తున్నారు. ఇటీవల మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతం లక్ష్యద్వీప్ కు వెళ్లి అక్కడ ఫొటోలు దిగి మన పర్యాటకాన్ని డెవలప్ చేయాలని సందేశం ఇచ్చారు. దీంతో మాల్దీవులుకు చెందిన మంత్రులు మన దేశ ఔన్నత్యాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఫలితంగా ఆ దేశ పర్యాటకం ప్రమాదంలో పడింది.
ఇంతకీ లక్ష్యద్వీప్ ను సందర్శించి మన పర్యాటకాన్ని కాపాడాలని ప్రధాని ఇచ్చిన సందేశం అందరిలో దేశభక్తిని పెంచింది. లక్ష్యద్వీప్ గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. భారత పర్యాటకులు లక్ష్యద్వీప్ ను సందర్శించడానికి తహతహలాడుతున్నారు. అక్కడి వారి ఆహారం, జీవనశైలి, అలవాట్ల గురించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
36 చిన్న ద్వీపాలతో నిండిన లక్ష్యద్వీప్ జనాభా 64 వేలు. 96 శాతం ముస్లింలున్నారు. 32 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మాల్దీవులతో పోలిస్తే లక్ష్యద్వీప్ వైశాల్యం పది రెట్లు తక్కువ. ఇక్కడ 32ద్వీపాలు ఉన్నాయి. కానీ పది ద్వీపాలలో జనాభా ఉంది. కనర్తి, అగట్టి, అమిని, కద్మత్, కిలాతన్, చెట్లత్, బిర్రా, ఇందోహ్, కర్సాని మరియు మినికాయ్ ఉన్నాయి. కనరత్తి రాజధాని.
లక్ష్యద్వీప్ లో మలయాళం మాట్లాడతారు. కొంతమంది మహేని మాట్లాడతారు. మాల్దీవులలో ఇదే భాష మాట్లాడతారు. లక్ష్యద్వీప్ వారి ప్రధాన ఆదాయ వనరు సముద్రమే. పర్యాటకం, చేపలు పట్టడం వంటివి వారి పనులు. లక్ష్యద్వీప్ దేశానికి ఆదాయాన్ని అందించే వనరు. 600 కంటే ఎక్కువ జాతుల చేపలు ఇక్కడ కనిపిస్తాయి. 78 కంటే ఎక్కువ రకాల పగడాలు లభిస్తాయి.
ఇక్కడ పాములు, కుక్కలు వంటి జంతువులు కనిపించవు. కాకులు కూడా కానరావు. పిల్లులు, ఎలుకలు కూడా అక్కడ నివసించవు. లక్ష్యద్వీప్ రేజస రహిత రాష్ట్ర హోదా ఉంది. 1956 కంటే ముందు లక్కడిప్ అని పిలిచేవారు. తరువాత లక్ష్యద్వీప్ గా మార్చారు. బటర్ ఫిష్ రాష్ట్ర జంతువు. సీతాకోక చిలుకల లాంటి చేపలు ఇక్కడ దొరుకుతాయి. ఈ రాష్ట్ర పక్షి టెర్న్. బ్రెడ్ ఫ్రూట్ ఈ రాష్ట్ర చెట్టు.