Freedom Fighter : వేటకు వెళ్లిన పులి ఎలా ఉంటుందో తెలుసా.. అతడే ఈ స్వాతంత్య్ర సమరయోధుడు

Freedom Fighter

Freedom Fighter

Freedom Fighter : భగత్ సింగ్ సెప్టెంబరు 28 1907 సంవత్సరంలో ప్రస్తుత పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలో జన్మించాడు. దేశ స్వాతంత్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించి బ్రిటిష్ తూటాలకు ఎదురొడ్డాడు. చివరకి ఉరికంబం ఎక్కాడు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో 23 ఏళ్ల నవ యువకుడిని బ్రిటిష్ వారు ఉరి తీశారని తెలిసి దేశం రగిలిపోయింది. విప్లవం వర్దిల్లాలి అంటూ ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలిచారు భగత్ సింగ్. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్ సింగ్ పోరాటం మరువలేనిది. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్దిలాల్లి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగ్.

భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకడు. ఇప్పటి పాకిస్తాన్ లో జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. అయితే భారత్ లో బ్రిటీషులో పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన పుట్టాడు. యుక్త వయసులోనే దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు పోరాడిన వ్యక్తి భగత్ సింగ్. హిందూస్తాన్ సామ్య వాద గణతంత్ర సంఘంలో ఆయన చేరాడు.

భారత్, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ 64 రోజులు ఉద్యమం చేపట్టడం ద్వారా విపరీతమైన మద్దతు కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చి చంపాడు భగత్ సింగ్. దీంతో అతడిని ఉరి తీశాడు.

లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, భగత్ సింగ్ ల పాత్ర స్వాతంత్య్ర పోరాటంలో ఎనలేనిది. ముఖ్యంగా భగత్ సింగ్ భారతీయ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. భగత్ సింగ్ లాగా యువకులు దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికీ ఎంతో మంది చెబుతూనే ఉంటారు. కాగా వేటకు వెళ్లిన పులి లా ఉంటాడు భగత్ సింగ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

TAGS