JAISW News Telugu

Doctor : వామ్మో ఈ డాక్టర్ మాములోడేం కాదు.. తన వీర్యంతో ఏకంగా వంద మందికి..?

Doctor

Doctor

Doctor : తల్లి కావాలనేది చాలా మందికి ఆశ. అయితే ఈ ఆశ నెరవేరని వారు వివిధ రూపాల్లో పిల్లలను కనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక వేరొకరి శుక్రకణాన్ని స్వీకరించడం ద్వారా గర్భం దాల్చడం ఇప్పుడు కొత్తేం కాదు. ఎలాంటి లైంగిక సంబంధం లేకుండా కేవలం స్పెర్మ్ బ్యాంక్ నుంచి వీటిని పొందవచ్చు. అయితే ఇక్కడ ఒక డాక్టర్ ఏకంగావంద మందికి తన వీర్యాన్ని దానం చేశాడు. ఇలా ఆ డాక్టర్ గురించి ఇద్దరు అక్కా చెల్లెళ్ల ద్వారా ప్రపంచానికి తెలిసింది. తమకు జన్మనిచ్చిన తల్లి గురించి తెలిసినా, వీర్యం మాత్రం తమ తండ్రిది కాదని తెలుసుకొని వారు ఈ ప్రయత్నం చేశారు. తల్లిదండ్రులు మరణించిన అనంతరం తమ పుట్టుకకు కారణమెవడో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

50 ఏండ్ల క్రితం తల్లి తమను కన్న దవాఖానకు వెళ్లారు. అక్కడ ప్రసూతి రికార్డును పరిశీలించచారు. డాక్టర్ పేరు పీవెన్ అని తెలుసుకున్నారు.  ఇక ఆ డాక్టర్ గురించి వెతకడం ప్రారంభించారు. ఇలా వారు చాలా ప్రాంతాలు తిరిగారు. ఇక తమ వంశవృక్షంగురించి వారు ఆరా తీస్తుండగా, డాక్టర్ పీవెన్ మనుమడి ఆచూకీ వారికి లభించింది. కొంత సందేహం అనంతరం మనుమడి డీఎన్ఏ ను చెక్ చేస్తే ఆ అక్కా చెల్లెళ్లతో సరిపోలింది. ఇంకాస్త లోతుగా వెళ్లాలని ఆ ఆక్కాచెల్లెళ్లు నిర్ణయించుకున్నారు. సుమారు రెండేళ్లు కష్టపడింది. తన తల్లికి ప్రసవం చేసిన డాక్టరే తమకు జెనిటిక్ ఫాదర్ అని కనిపెట్టింది. ఆ డాక్టర్ ను కలుసుకుంది. అప్పటికే అతడికి 104 ఏండ్లు. తరువాత ఆయన చెప్పిన వివరాలను చూసి ఆశ్చర్యపోయింది చెల్లి హాల్.

సంతానం కోసం వైద్యానికి ఆ డాక్టర్ వద్దకు చాలా మంది వచ్చేవారట. కృత్రిమ గర్భాధారణపై అప్పుడు ప్రయోగాలు కొనసాగుతున్నయి. ఇక ఈ క్రమంలో సంతానం లేని మహిళలు  శాపంగా భావించేవారు. ప్రసూతి వైద్యంలో ఆయన 40 ఏండ్ల పాటు సేవలందించారు. ఇక ఇలా కృత్రిమ గర్భం ద్వారా ఆయన ఎంత మందికి జన్మనిచ్చారో తెలుసుకోవచ్చు. కానీ డాక్టర్ గా తాను చేసింది తప్పు పని హాల్ అంటున్నది. అయితే ఆయన మాత్రం ఏకంగా 114 మందికి వీర్యం దానం చేశాడట.

Exit mobile version