Raj Tarun : అమ్మాయిలు అంటేనే రాజ్ తరుణ్ జంకుతున్నడు. ‘మీకు ఓ అమ్మాయి గురించి చెప్పాలి.. నా జీవితంలో అమ్మాయిల టాపిక్ మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. ఒసేయ్ నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా.. నీ అంతు చూస్తా.. నీ ఫొటో ఆన్ లైన్ లో పెడతా..’ స్వయంగా రాజ్ తరుణ్ అన్న మాటలివి. అయితే ఇవి ఇప్పుడు కాదు.. రెండేళ్ల కిందట అన్న మాటలు. అయితే ఈ మాటలు తన లైఫ్ కు సంబంధించినవి కాదు. అప్పట్లో ఓటీటీలో ఓ వెబ్ సిరీస్ చేశాడు.. ఆ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా అన్న మాటలివి.
ఇప్పుడా వీడియో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం లావణ్యకు వివాదంలో రాజ్ తరుణ్ ఇరుక్కుపోయాడు. రాజ్ తరుణ్ తన భర్త అని, మాల్వి మల్హోత్రా తన భర్తను లాక్కుందని ఆరోపిస్తోంది. తనకు అబార్షన్ చేయించాడని, ప్రస్తుతం నా చావు కోరుకుంటున్నాడని ఆరోపణలు చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి ఈ డైలాగ్ సింక్ అవుతుండడంతో.. రెండేళ్ల కిందటి ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు జనం.
త్వరలోనే సీన్ లోకి అరియానా?
రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తున్న లావణ్య కొంత మంది హీరోయిన్ల పేర్లను ప్రస్తావించింది. హీరోయిన్లు షాలినీ, రిద్దీ కుమార్ రాజ్ తరుణ్ కు ఎఫైర్ ఉందని.. బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో కూడా ఎఫైర్ సాగించాడని చెప్పుకొచ్చింది.
దీనికి సంబంధించి షాలినీ, రిద్దీ కుమార్ స్పందించలేదు. అరియానా త్వరలోనే స్పందిస్తుందని అంటున్నారు. మాల్వి మల్హోత్రా తరహాలోనే అరియానాపై కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుందని సమాచారం.