JAISW News Telugu

Director Krish : పార్టీకి వెళ్ళా కానీ డ్రగ్స్ తీసుకోలేదు: డ్రగ్స్ కేసులో పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్!!

Director Krish

Director Krish

Director Krish : హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతుంది. ఈ డ్రగ్ పార్టీ కేసులో ప్రధానంగా చర్చనీ యాంశంగా మారిన డైరెక్టర్ క్రిష్ నిన్న సైబరాబాద్ పోలీసులు విచారణకు హాజరయ్యారు. అత్యంత గోప్యంగా ఆయన పోలీసుల విచారణకు హాజర య్యారు.

పోలీసులు ఆయనను విచారిస్తున్న క్రమంలో ఆయన నుండి రక్త మరియు మూత్ర నమూనా లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపిం చారు.అయితే తను పార్టీకి వెళ్లిన మాట వాస్తవమే నని, డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని క్రిష్ చెబుతు న్నారు. ఈ విషయంలో తను ఎలాంటి పరీక్షల కైనా సిద్ధంగా ఉన్నానని క్రిష్ స్పష్టం చేశారు. ఊహించని విధంగా నిన్న సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు, ఎవరి కంటా పడకుం డా హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేషన్ కి వెళ్ళిన క్రిష్ మాదాపూర్ డిసిపి కార్యాలయానికి వెళ్లి అక్కడ డిసిపి తో గంటసేపు క్రిష్ మాట్లాడారు.

ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగం చేసినట్టు తనకు తెలియదని పేర్కొన్న క్రిష్, స్నేహితుడు రఘు చరణ్ తనకు ఫోన్ చేస్తే రాడిసన్ కు వెళ్లాలని, అక్కడ అరగంట మాత్రమే తాను ఉన్నానని చెప్పినట్టు సమాచారం. ఒక సినిమా చర్చల కోసం తన ముంబై వెళ్లానని, అందుబాటులో లేకపోవడం వల్లే విచారణకు హాజరు కాలేదని డైరెక్టర్ క్రిష్ తెలిపారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కారణం గానే జరిగిన విషయం చెప్పడానికి వచ్చానని క్రిష్ డిసిపి కి వెల్లడించారు. అయితే డిసిపి మాత్రం డైరెక్టర్ క్రిష్ రక్త మరియు మూత్ర శాంపిల్స్ తీసుకొ ని పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రిపోర్టు లను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుం దని తెలిపిన డిసిపి, పోలీసులకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని, ఎప్పుడు పిలిచినా రావాలని డైరెక్టర్ క్రిష్ కు సూచించారు.

Exit mobile version