Nara Lokesh : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ ఒక్క ఛాన్స్ అంటూ 2019 లో వేడుకున్నాడు. దీంతో తమ తలరాతలు మారుస్తాడని ఆశ పడ్డ ప్రజలు ఆయనను గద్దెనెక్కించారు. కానీ ఆ అవకాశాన్ని జగన్ వాడుకోలేకపోయారు. సరైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రజా పాలనను గాలికి వదిలి ఇష్టం వచ్చిన నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆగం ఆగం చేశారు. ఆయనతో పాటు ఆయన పరివారం కూడా రాష్ట్రంపై పడి దోచుకోవడం మొదలు పెట్టారు. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీ నేతలు, ఆ పార్టీ కేడర్ పై వారు చేయని అరాచకాలు లేవంటే అతిశయోక్తి కావు. పాపం ఆ ఘటనలు ఇప్పిటికీ టీడీపీ నాయకులు కండ్లలోనే తిరుగుతున్నాయి.
ఐదేళ్ల అరాచక పాలనకు ఓటు అనే ఆయుధంతో అడ్డుకట్ట వేశారు ఓటర్లు. ఓటు తో వైసీపీ రాత మార్చినా వారి బుధి మాత్రం మారడం లేదంటూ టీడీపీ నేత నారా లోకేష్ ఒక సమావేశంలో అన్నారు. కర్నూల్ టీడీపీ నేత గౌరినాథ్ హత్యపై లోకేష్ ఇటీవల స్పందించారు. ఓడినా జగన్ రక్త చరిత్ర కొనసాగుతూనే ఉందంటూ దుయ్యబట్టారు.
వైసీపీ ఫ్యాక్షన్ పాలనతో విసిగిన ప్రజలు జగన్ ను ఛీ కొట్టినా బుద్ధి రాలేదన్నారు. బాబాయిని చంపిన ఆయన జనాలను కూడా కష్టాలు పెట్టి మరీ చంపుతున్నాడు. ఇక్కడితో జగన్ హత్యా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే రానున్న రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు లోకేష్.
అధికారంలో ఉన్న సమయంలో మా పార్టీ కార్యకర్తలకు బీపీ వస్తే దాడులకు తెగబడతారు అంటూ హింసను ప్రోత్సహించిన జగన్ ప్రతిపక్షంలోకి వచ్చినా టీడీపీ, జనసేన కార్యకర్తలను రెచ్చకొడుతూ దాడులకు పురికొల్పుతున్నారు. ‘వై నాట్ 175’ అంటూ విర్రవీగిన నేతకు ‘యూ గో 11’ అంటూ బదులిచ్చారు ఏపీ ప్రజలు.
తప్పెక్కడ జరిగింది, దేన్ని మార్చుకోవాలి అనే దానిపై సమీక్షలు పెట్టుకోకుండా రెచ్చకొడతాం, రెచ్చిపోతాం అంటే టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో లేదనేది జగన్ గ్రహిస్తే ఆయనకు, ఆయన పార్టీకి మేలు చేసిన వారవుతారని హితవు పలికారు. ఇదే ధోరణితో వైసీపీ అండ్ కో మొండిగా ముందుకెళ్తే లోకేష్ హెచ్చరిస్తున్నట్లు వైసీపీ మాత్రమే కాదు జగన్ కూడా రాజకీయాల నుంచి కనుమరుగవ్వక తప్పని పరిస్థితులు తలెత్తుతాయి.