– హెచ్చరించిన వాతావరణ శాఖ
Weather Alerts : తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటితో పోలీస్తే ఈరోజు, రేపు 2 నుంచి 3 డీగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని తెలిపింది. కాగా, సోమవారం అత్యధికంగా భ్రదాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వడగాల్పులు తీవ్రమయ్యే అవకాశముందని హెచ్చరించింది. బుధవారం కొన్ని జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
గత వారం కొంత వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. మళ్లీ ఎండల తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో పలు జాగ్రత్తలు తీసుకునేందుకు యత్నిస్తున్నారు.