Wealth India : ఆ దేశంలో తరతరాలకు సరిపడ సంపద..! భారత్ ఏ స్థానంలో ఉందంటే..

Wealth India

Wealth India, Switzerland

Wealth India : మనం ఎప్పుడూ పెద్దల నుంచి ఓ మాట వింటుంటాం..‘ధనవంతుడు మరింత ధనవంతుడవుతున్నాడు.. పేదోడు మరింత పేదోడు అవుతున్నాడు’’ అని. ఇది అక్షరాల నిజమే. సంపద ఎవరికీ చేదు కాదు. అది ఉంటే మంచి తిండి, మంచి ఆరోగ్యం, మంచి చదువు, మంచి ఉద్యోగం లేదా ఉపాధి వస్తాయి. వీటితో పౌరులు సంపన్నులు కావడమే కాదు ఆ దేశం కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది.

ప్రపంచంలో వివిధ సంస్థలు ఆర్థిక, ఆకలి, కాలుష్యం, అక్షరాస్యత..లాంటి విషయాలపై సర్వే చేసి ఏ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో నివేదికల ద్వారా తెలియజేస్తాయి. వీటి ద్వారా ఆయా దేశాలు వాటిని మెరుగుపరుచుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటాయి. అయితే ఇటీవల ఓ సర్వే తరతరాలకు సరిపడ సంపదను కూడబెట్టిన దేశాల చిట్టాను వెల్లడించింది. అందులో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది.. ఏదేశం చిట్టచివరన ఉంది.. ఏ దేశం ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని తెలిపింది.

ఈ జాబితాను ఇచ్చింది పౌర సలహా సంస్థ అయిన హెన్లీ అండ్ పార్ట్ నర్స్. ఈ కొత్త సూచీ ప్రకారం మొత్తం సూచికల్లో సుమారు 85శాతం స్కోర్ తో స్విట్జర్లాండ్ అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సూచికలకు సంబంధించి.. సంపాదన సంభావ్యతలో(100), కెరీర్ పురోగతిలో (93), ఉపాధి అవకాశాల్లో(94) పాయింట్లతో స్విట్జర్లాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

ఇక అధిక జీవన శైలి, ఆర్థిక చలనశీలతపై కూడా స్విట్స్ 75 పాయింట్లు సాధించగా, ప్రీమియం విద్యలో 73 పాయింట్లు స్కోర్ చేసింది. ఇలా ఆయా మొత్తం విభాగాల్లో 82 శాతం స్కోర్ చేసి స్విట్జర్లాండ్ తర్వాతి స్థానానికి పరిమితమైంది. అయితే ఉపాధి అవకాశాల పరంగా యూఎస్ స్విట్జర్లాండ్ తో సమానంగా 94 పాయింట్లు సంపాదించుకుంది. కానీ సంపాదన సంభావ్యత(93), కెరీర్ పురోగతి(86), అధిక జీవనోపాధి(68)లలో క్షీణించింది.

ఇక ఉపాధి అవకాశాలు, ప్రీమియం విద్యపరంగా 74 పాయింట్లు స్కోర్ చేసింది. ఇక తరతరాలకు సరిపడే సంపదలో భారత్ మొత్తం సూచికల్లో సుమారు 32శాతం పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఇది గ్రీస్ తో పోలిస్తే తక్కువ. అలాగే జాబితాలో మొదటి 15 స్థానాల్లో చివరి స్థానానికి పరిమితమైంది భారత్. ఆర్థిక చలనశీలతలో 8 పాయింట్లతో అత్యల్ప స్కోర్ చేయగా, ఇతర సూచికల్లో 43 పాయింట్లతో అత్యధిక పురోగతిని కలిగి ఉంది. సింగపూర్ 79శాతంతో మూడో స్థానంలో ఉంది. అత్యధిక ఉపాధి అవకాశాల పరంగా మిగతా 15 దేశాల కంటే ఎక్కువ పాయింట్లు స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా 75శాతంతో నాలుగో స్థానంలో, కెనడా 74శాతంతో ఐదో స్థానంలో ఉంది. అలాగే గ్రీస్ 49శాతంతో 15 దేశాల జాబితాలో చివరి స్థానంలో ఉంది.

TAGS