Development of Andhra : ఆంధ్ర అభివృద్ధికి సంపద

Development of Andhra

Development of Andhra

Development of Andhra : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృధి తనతోనే సాధ్యమవుతుందని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండోసారి అధికారం లోకి రావడానికి ఆయన ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. అన్న అవినీతి,అక్రమాలను ఎండగడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

జగన్ కు రెండోసారి అధికారం దక్కకుండా ప్రచారం చేస్తూ  ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అదేవిదంగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా అవతరించాయి. కూటమి కూడా జగన్ ను లక్ష్యముగా జనంలోకి వెళ్లి విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఎన్నడూ లేనివిదంగా ఆంధ్రాలో సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రచారం చేయడం విశేషం. రోడ్ షో, బహిరంగ సభలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు.

జగన్ మాత్రం కాంగ్రెస్, కూటమిలను ఎదుర్కొంటూనే అభివృద్ధి తనతోనే సాధ్యమంటూ హామీలు గుప్పిస్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం కూడా తనకంటే మించిన నాయకుడు లేడని అంటున్నారు జగన్. పేద ప్రజలకు సంక్షేమ పథకాల కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే ప్రతిపక్షాల ప్రశ్నకు కూడా దీటుగానే సమాధానం ఇస్తున్నారు. సంపద సృష్టించి నిధులు పెంచుకుంటానని అంటున్నారు. ఆ నిధులతోనే పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేసి తీరుతానని ప్రజలకు హామీ ఇస్తూనే, ప్రతిపక్షాలకు తనదయిన శైలిలో సమాధానం చెబుతున్నారు.

గత ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తూనే, చేయబోయే అభివృద్ధిని చెబుతున్నారు. ఇప్పటివరకు 17 మెడికల్ కళాశాలలను తీసుకురావడం జరిగిందని చెబుతున్నారు. కానీ ఐదింటికి మాత్రమే అనుమతులురావడం విశేషం. 45 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి, విద్యార్థులకు మెరుగయిన సౌకర్యాలు కల్పించారు. 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన  అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ప్రచారంలో వివరిస్తున్నారు.

నాలుగు కొత్త కోర్ట్ లు ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అని అంటున్నారు. 2.21 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులను ఆదుకోవడంలో తన కంటేగొప్ప నాయకుడు లేడంటున్నారు. 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు భర్తీ చేసాననడం ప్రభుత్వానికి సంబంధం లేనిది. దీన్ని కూడా తన ఖాతాలో జగన్ వేసుకోవడం శోచనీయం

TAGS