Rohit Sharma : ఇండియా యుఎస్ఏ మధ్య జరిగిన టి20 వరల్డ్ కప్ గ్రూప్ ఎ మూడో మ్యాచ్లో భారత్ చెమటోడ్చి గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ బ్యాటర్లను అర్షదీప్ సింగ్ తన ఫేస్ బౌలింగ్ తో బెంబేలెత్తించాడు. మొదటి ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ జహంగీర్ ను డక్ అవుట్ చేసి సత్తా చాటాడు. చివరి బంతికి వన్ డౌన్ బ్యాట్స్ మెన్ అండ్రీస్ ను అవుట్ చేశాడు.
ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అమెరికా బౌలింగ్ సైతం ఆకట్టుకుంది. భారత సంతతి ఆటగాడు అయినటువంటి సౌరభ్ నేత్రవల్కర్ విరాట్ కోహ్లీని ఫస్ట్ బాల్ కి పెవిలియన్ కు పంపాడు రోహిత్ శర్మని కూడా మూడు పరుగుల వద్ద అవుట్ చేశాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ కేవలం వారిద్దరి వల్లే మ్యాచ్ గెలిచిందని అన్నాడు.
మొదట మూడు వికెట్లు తొందరగా కోల్పోయిన భారత్ ను సూర్య కుమార్ యాదవ్, శివం దూబె సమయోచిత ఇన్నింగ్స్ తో గట్టెక్కించారు. మొదటినుంచి ఆచితూచి ఆడినటువంటి సూర్య కుమార్ యాదవ్ శివం దుబే ఇద్దరూ చివరి ఆరు ఓవర్లకు 49 పరుగులు చేయాల్సిన సమయంలో జూలు విదిల్చారు. స్కోర్ బోర్డు ని పరుగెత్తించారు. సీనియారిటీని ఉపయోగించుకుని మ్యాచ్ చేజిక్కించుకున్నారు.
సూర్య కుమార్ యాదవ్ 49 బంతుల్లో రెండు సిక్సులు రెండు ఫోర్ లతో ఆఫ్ సెంచరీ సాధించాడు. శివం దుబే 31 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. దీంతో భారత్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని అందుకుంది. కఠిన మైన ఇలాంటి పిచ్ లపై గెలవడం చాలా సంతోషంగా ఉందని కెప్టెన్ రోహిత్ అన్నాడు. పిచ్ లో బౌన్స్, స్లో గా ఉండటం వల్ల పరుగులు రావడమే కష్టమని అన్నాడు. టీ 20 ల కాకుండా బ్యాటింగ్ పై దృష్టి పెట్టి ఆడితేనే ఇక్కడ విజయాలు సాధించడం సాధ్యం.