JAISW News Telugu

Bihar CM Nitish : ఎన్డీయేతోనే ఉంటాం.. స్పష్టం చేసిన బిహార్ సీఎం నితీశ్..

Bihar CM Nitish

Bihar CM Nitish and PM Modi

Bihar CM Nitish : తాము ఎన్డీయేలోనే కొనసాగుతామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. నితీశ్ కుమార్ కు చెందిన జేడీ(యూ) ఎన్డీయేలోనే భాగం అవుతుందని నితీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నానానికి అందుబాటులో ఉన్న ట్రెండ్స్ ప్రకారం, JD(U) దాని కూటమి భాగస్వామి BJP కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ‘మేము NDA తోనే ఉండబోతున్నాం, సంకీర్ణం అంటే ఏమిటో నితీశ్ కుమార్‌కి అర్థమైంది. ప్రతిపక్షాలు నితీష్‌ కుమార్‌ను తక్కువ అంచనా వేసింది’ అని జేడీ(యూ) నేత నీరజ్‌ కుమార్‌ అన్నారు .

నితీష్ కుమార్ ఎప్పుడూ ‘బీహార్ ప్రజల కోసం ఆలోచించే’ నిర్ణయం తీసుకుంటారని మంత్రి జమా ఖాన్ అన్నారు. ‘మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అనుసరిస్తాం, గౌరవిస్తాం. ఫలితాలు రావాలి. నితీష్ కుమార్ ఎప్పుడూ బిహార్ ప్రజల కోసం ఆలోచిస్తారని, ఆయన నిర్ణయమే సర్వోన్నతంగా ఉంటుంది’ అన్నారు. ‘మేము ఎన్డీయేతో దృఢంగా ఉన్నాం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని మరో జేడీ(యూ) మంత్రి మదన్ సహానీ అన్నారు.

ప్రతిపక్ష ఇండీ కూటమిలో భాగమైన తేజస్వి యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాగట్ బంధన్ రాష్ట్రంలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉందని తేలింది. ఐదేళ్లలో నితీష్ కుమార్ రెండు సార్లు పొత్తులు మార్చుకున్నప్పటికీ, బిహార్‌లో మొత్తం 40 సీట్లలో 30కి పైగా ఎన్డీయే కైవసం చేసుకోవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 2019లో కూడా ఎన్డీయే 39 సీట్లతో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది.

నితీశ్ కుమార్ ఐదు నెలల క్రితమే తిరిగి ఎన్‌డీఏలోకి తిరిగి వచ్చారు, అయితే అతను టీఎంసీ అధినేత మమతా బెనర్జీ వంటి ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి ఇండీ కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ప్రస్తుతానికి, JD(U) పోటీ చేసిన 16 స్థానాలకు గానూ 14 స్థానాల్లో ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నట్లు ట్రెండ్స్ చూపిస్తున్నాయి. 17 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, జూనియర్ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) హాజీపూర్‌తో సహా మొత్తం 5 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక్కడ దాని అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ దాదాపు 24,000 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

Exit mobile version