Iran Vice President Javed : రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రష్యాకు ఆయుధాలు పంపిస్తామని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ జావేద్ జరీఫ్ ప్రకటించారు. కష్టకాలంలో సాయం చేసిన వారిని టెహ్రాన్ ఎప్పటికీ మరిచిపోదని వెల్లడించారు. ఉక్రెయిన్ తో జరిగే యుద్ధం కోసం రష్యాకు ఆయుధాలను సరఫరా చేస్తూ ఆర్థికంగానూ లాభాలు సంపాదిస్తామని తెలిపారు. యుద్దం సమస్య పరిష్కారం కాదంటూనే డబ్బు సంపాదించడం కోసం రష్యాతో వ్యాపారం చేస్తామని పేర్కొన్నారు.
ఇరాన్ లో అన్ని వ్యాపారాలను ఎందుకు మూసివేశారో యూరోపియన్లు సమాధానం చెప్పాలన్నారు. ఇరాన్ ఏమైనా ఒప్పందాలను ఉల్లంఘించిందా? అని జరీఫ్ ప్రశ్నించారు. ఇకపై ప్రతిఒక్కరూ తమతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి సమగ్ర ప్రణాళికల నుంచి అమెరికా వైదొలగడంతో ఏర్పడిన సంక్షోభాన్ని ముగించాలనే దానిపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని జఫీర్ వెల్లడించారు.