Deputy CM Pawan Kalyan : కలుషిత నీరు అనే మాట వినపడకుండా చేస్తాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan : రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరి హక్కు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. జలజీవన్ మిషన్ పై శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రతి ఇంటికి తాగు నీరందిస్తామని భరోసా ఇచ్చారు. కలుషిత నీరు అనే మాట వినపడకుండా చేస్తామని, కిడ్నీ సమస్యలు తగ్గిస్తామని చెప్పారు. చాలా ఆర్వో ప్లాంట్లు పాడైపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకు రాగా, వాటిని పునరుద్ధరిస్తామని పవన్ తెలిపారు.