Balakrishna : ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోం: బాలకృష్ణ

Balakrishna

Balakrishna

Balakrishna : ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోనని, నియోజక వర్గం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అన్నారు. స్థానిక టీడీపీ నాయకలు, అభిమానుల మధ్య సోమవారం ఆయన 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని బాలకృష్ణ పునఃప్రారంభించారు. అనంతరం హిందూపురం జేవీఎస్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. దీంతో పాతికేళ్లు వెనక్కివెళ్లాం. ప్రభుత్వం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు టీడీపీకి అఖండ విజయాన్ని అందించారు. ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయబోం. హిందూపురానికి పరిశ్రమలు, రింగ్ రోడ్డు, హంద్రినీవా ద్వారా అన్ని చెరువులను నీరు అందించేందుకు కృషి చేస్తా. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పురోగమిస్తుంది’’ అని బాలకృష్ణ తెలిపారు.

TAGS