Union Minister Rammohan Naidu : సీ ప్లేన్ ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరో 3-4 నెలల్లో ఏపీలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో సీ ప్లేన్ ప్రయాణం ఉంటుందని చెప్పారు. ఏపీలో 4 రూట్లలో నడిపేందుకు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద పున్నమిఘాట్ కు సీ ప్లేన్ చేరుకుంది. కాసేపట్లో బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు సీఎం చంద్రబాబు అందులో ప్రయాణం చేయనున్నారు. దీంతో పున్నమి ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 14 మంది కూర్చునేలా సీ ప్లేన్ సీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో ప్రయాణించి సీఎం శ్రీశైలానికి చేరుకోనున్నారు.