Minister Nara Lokesh : విద్యలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh

Minister Nara Lokesh

Minister Nara Lokesh  : విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని, ఇందుకోసం దీటైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకెళ్తోందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. అమరావతి విట్-ఏపీ విశ్వవిద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను లోకేశ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి లోకేశ్ కీలకోపన్యాసం చేశారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము కానీయకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి. సవాళ్లకు భయపడకూడదని చెప్పారు.

ఈ సందర్భంగా విట్ యూనివర్సిటీ విద్యార్థులు వినూత్నంగా రూపొందించిన వివిధ ఆవిష్కరణలను లోకేశ్ వీక్షించారు. వ్యవసాయ పనులకు తక్కువ ఖర్చులో లభ్యమయ్యే, వరదలను గుర్తించగల అత్యాధునిక డ్రోన్ ను ప్రదర్శించగా మంత్రి ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శనలో వివిధ దేశాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి నారా లోకేశ్ ఆసక్తిగా తిలకించారు. తమ దేశాల్లో ఉన్నత విద్య అవకాశాలు, కోర్సుల వివరాలు, అడ్మిషన్లు, ఉపకారవేతనాలు, సౌకరకయాలు వివరిస్తూ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడాకు చెందిన విద్యాసంస్థల ప్రతినిధులు ఈ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.

TAGS