KTR VS Congress : అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని పనుల టెండర్ల ద్వారా ప్రభుత్వ అవినీతి బయటపడిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఎక్కువ కోట్ చేసిన అనుకూల కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే రూ.4,350 కోట్ల ప్రజాధనాన్ని కొందరికి అప్పగించారని చెప్పారు. అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఖజానా నింపుకునేందుకు తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోందని కేటీఆర్ అన్నారు.