KTR : బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల నేతన్నలను కాపాడుకున్నామని, ఇప్పుడు మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల నేతన్నలకు రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని, ఉపాధి కల్పనతో ఆత్మహత్యలు తగాయని తెలిపారు. ప్రజలకు కేసీఆర్ కిట్లు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు అందజేశామన్నారు.
నేతన్నలతో చీరలు నేయించి పంపిణీ చేశామని, సిరిసిల్లను మరో తిరుప్పూరు చేయడానికి కృషి చేశామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారు. బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దానిపై విచారణ చేయాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పామన్నారు. సిరిసిల్ల నేతన్నల తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, మా పోరాటానికి నేతన్నలు కూడా సహకరించాలని కేటీఆర్ కోరారు.