MLC Kavitha : ‘‘రాష్ట్రంలో లిక్కర్ లేకుండా చేస్తా’’.. కవిత పాత వీడియో వైరల్

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్  స్కాం కేసులో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కవిత అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తే, కవితను అరెస్ట్ చేసి మంచి పనిచేశారని, కవిత మాత్రమే కాదు హైదరాబాద్ ల్యాండ్స్ కుంభకోణంలో కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్, హరీశ్ రావు కూడా జైలుకు వెళ్తారని ప్రత్యర్థి పార్టీలు పెద్ద ఎత్తున వారిని టార్గెట్ చేస్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రస్తుతం రిమాండ్ లో ఉండి, ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్న కవితకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ప్రమే..కవితను ఒకవేళ మీకు సీఎంగా అవకాశం ఇస్తే మీరేం చేస్తారు? అని అడిగిన ప్రశ్నకు కవిత ఆసక్తికర సమాధానం చెప్పారు.

ఒకవేళ నిజంగా తనకు సీఎంగా అవకాశం వస్తే రాష్ట్రంలో ఆల్కహాల్  లేకుండా చేస్తానని చెప్పారు. ఆల్కహాల్ లేకపోతే ప్రభుత్వానికి నష్టం వస్తుందని చెబుతారని, అయినప్పటికీ తాను మాత్రం అదే నిర్ణయం తీసుకుంటానని చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత, లిక్కర్ లేకుండా చేస్తానని చెప్పడంపై సోషల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. నిజంగా సీఎం అయితే అక్క విజన్ నెక్ట్స్ లెవల్.. మీరు ఒక వర్గానికి ఇన్ స్పిరేషన్ అక్క అంటూ కవితను టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇదే సమయంలో కవిత, కేటీఆర్, కేసీఆర్ ఏడుస్తున్నట్టు వీడియోలను సృష్టించి తెలంగాణ యాసలో సాగే కొన్ని పాటలతో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

TAGS