Rahul Gandhi : పార్లమెంట్ సాక్షిగా ప్రధానా మోదీకి రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీని ఓడించి తీరుతామని, ఇది రాసిపెట్టుకోవాలని సవాల్ విసిరారు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ ఈ సవాల్ చేశారు. దేశానికి యువతే వెన్నెముక అన్న రాహుల్.. ఉద్యోగాలు ఇవ్వకుండా వారి వెన్నెముక విరిచారని మండిపడ్డారు.
రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ ప్రస్తావనే లేదని రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పై చర్ను కోరితే ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. నీట్ తో పేద పిల్లలు వైద్యవిద్యకు దూరమయ్యారని చెప్పారు. ధనవంతుల కోసమే నీట్ పరీక్షనా అని సభలో ప్రభుత్వాన్ని రాహుల్ ప్రశ్నించారు. ప్రొఫెషనల్ ఎగ్జామ్ అయిన నీట్ ను కమర్షియల్ గా మార్చారని మండిపడ్డారు. గత ఏడేళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని రాహులు పేర్కొన్నారు.