JAISW News Telugu

Imams and Mauzams: ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనం కొనసాగిస్తాం: ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్

Imams and Mauzams:ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనం ఇవ్వడాన్ని కూటమి ప్రభుత్వం కొసాగిస్తుందని ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఈ మేరకు ఆయన వెల్లడించారు. పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇమాం, మౌజంలకు గౌరవ వేతనం టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తు చేశారు. ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తే ఇచ్చే ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తామన్నారు. గతంలో యాత్రకు వెళ్లి వచ్చినవారికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికే రూ.లక్ష అందజేస్తామని ఫరూక్ తెలిపారు.
Exit mobile version