JAISW News Telugu

KCR : మళ్లీ మనమే వస్తాం.. 15ఏళ్లు ఉంటాం.. పార్టీ వీడొద్దు.. జడ్పీ చైర్మన్లతో కేసీఆర్  

KCR

KCR

KCR : తెలంగాణలో బీఆర్‌ఎస్  మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లి  నివాసంలో ఆయన అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలో వస్తే మళ్లీ రాదన్నారు. వారు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్లు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు.  ఏదో గాలివాటున అధికారంలోకి వచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీ చైర్మన్లు అందరూ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని , విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ అభినందనలు అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో ఒకసారి వచ్చిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులన్నారు. దయచేసి మంచి భవిష్యత్ ఉందని పార్టీలు మారవొద్దని సూచించారు.

ఇదే విషయంలో ఎమ్మెల్యేలతో వరుసగా కేసీఆర్ భేటీ అయి నచ్చజెప్తున్నా పార్టీ మారాలనే ఆలోచనను ఎమ్మెల్యేలు వెనక్కి తీసుకోవడం లేదు. పైగా కేసీఆర్ భేటీ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ గూటికి చేరుతున్న పరిస్థతి.  సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం కేసీఆర్ కాపాడుకోలేకపోతున్నారని, రాజకీయాల్లో ఇక కేసీఆర్ పని అయిపోయినట్టేనని అందుకు ప్రస్తుత చేరికలే సాక్ష్యమని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఈ పరిణామాలతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ మార్చారని వినిపిస్తోంది. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యేలకు ఎంత బ్రెయిన్ వాష్ చేసిన ఫలితం ఉండడం లేదన్న వాస్తవాన్ని కేసీఆర్ గుర్తెరిగారని, అందులో భాగంగానే ఎమ్మెల్యేలను బుజ్జగించడం వదిలేసి జడ్పీ చైర్మన్ లతో మీటింగులు పెడుతున్నారని చర్చ జరుగుతోంది.  ఎమ్మెల్యేలు పార్టీని వీడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి స్థానంలో మీరుంటారని, రాబోయే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తామని జడ్పీ చైర్మన్ లకు కేసీఆర్ భరోసా ఇచ్చారని తెలుస్తోంది. ఎమ్మెల్యేల చేరికల అనంతరం జడ్పీ చైర్మన్ లపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తుందనే ముందుచూపుతోనే కేసీఆర్ వారితో భేటీ అవుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Exit mobile version