Minister Sridhar Babu : పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ లో గ్లోబల్ లాజిక్ సాఫ్ట్ వేర్ కొత్త ఆఫీస్ ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ అన్ని రకాల పెట్టుబడులకు అనుకూలమని మంత్రి చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి తమ ప్రభుత్వం తగిన తోడ్పాటునందిస్తుందన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలతో పాటు ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. రాష్ట్రం నుంచి ఏఐ ఎక్స్ పోర్ట్స్ 12 శాతానికి చేరాయని, రాబోయే రోజుల్లో మరింత ప్రగతి సాధించేలా ఏఐ సిటీ దోహదపడుతుందన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. స్కిల్ యూనివర్సిటీతో యువతలో నైపుణ్యాలు పెంపొందిస్తామని తెలిపారు.