Minister Durgesh : పర్యాటక రంగానికి రెండేళ్లలో పూర్వ వైభవం తీసుకొస్తాం: మంత్రి దుర్గేశ్

Minister Durgesh

Minister Durgesh

Minister Durgesh : పర్యాటక రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి దుర్గేశ్ విమర్శించారు. ఈ రంగానికి రెండేళ్లలో పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. 38 విభాగాల్లో అవార్డులు కూడా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రణాళికను తయారుచేసినట్లు పేర్కొన్నారు. బీచ్ రిసార్ట్స్, ఫెస్టివల్ రిసార్ట్స్, నగరవనాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు.

మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి కందుల దుర్గేశ్ వెళ్లారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి కోడూరులోని బీచ్ ను అభివృద్ధి చేయాలని మంత్రి దుర్గేశ్ ను కోరినట్లు తెలిపారు. గత ఐదేళ్లుగా పర్యాటక ప్రాంతాలను ప్రైవేటు వ్యక్తులు సర్వనాశనం చేశారని విమర్శించారు. జిల్లాకు మంజూరైన 6 నగర వనాల అభివృద్ధి కోసం మంత్రికి ప్రతిపాదించినట్లు చెప్పారు. కాకుటూరు నగరవనాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టే బాధ్యత తనదేనని తెలిపారు.

TAGS