CM Revanth Reddy : అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం : రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రవేశపెడతామన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందజేయనున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్‌లో సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన 41 మంది అభ్యర్థులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటం ఉద్యోగ నియామకాల కోసమే జరిగిందన్నారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు.

UPSC తరహాలో TGPSCలో మార్పులు తీసుకొచ్చామన్నారు. గ్రూప్స్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని, ప్రస్తుతం డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు. నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసినట్లు తెలిపారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. పక్కా ప్రణాళికతో పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ప్రతి సంవత్సరం మార్చి నెలలో అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను తెప్పిస్తామన్నారు. ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రవేశపెడతారు.  జూన్ 2లోగా నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ 9 నాటికి రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థను అభినందించారు. మెయిన్స్‌కు సన్నద్ధం కావడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు.

TAGS