Minister Sathya Kumar : వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తామని మంత్రి సత్యకుమార్ అన్నారు. డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామాల్లో కలుషిత నీటితో అతిసార కేసులు ప్రబలుతున్నాయని అన్నారు. యనమకుదురులో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. ప్రాణం నిలబెట్టే ఆస్పత్రులు నిజమైన దేవాలయాలు అని అన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి కారణమైన వెలగపూడి ట్రస్ట్ దాతృత్వం వెలకట్టలేనిదని కొనియాడారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం అని అన్నారు. ఆరోగ్య రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తాం అని చెప్పారు.
నీట్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు దృష్టి సారించినట్లు చెప్పారు. గ్రామాల్లో కలుషిత నీటితో అతిసార కేసులు ప్రబలుతున్నాయని అన్నారు. పరీక్షలు నిర్వహిస్తే 240 చోట్ల కలుషిత నీరు కారణమని తేలిందని వివరించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.