Chandrababu: మేము చంద్రబాబు బాటలోనే నడుస్తాం. 

Chandrababu

Chandrababu

Chandrababu : 2019 ఎన్నికల నాటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2019 లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చంద్రబాబు నాయుడు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ సరిగా లేదంటూ చంద్రబాబు నన హంగామా చేశారు. ఏసీ అన్నివిధాలుగా విఫలం అయ్యిందంటూ ఆరోపించారు. అంత గొడవ చేస్తూనే చంద్రబాబు గెలుస్తామనే ధీమాను పార్టీ పార్ట్ శ్రేణుల్లో నింపడం విశేషం. అయినా పార్టీ ఓటమిని రుచి చూడక తప్పలేదు.

2024 ఎన్నికలు ముగిశాయి. ఏ పార్టీ ఎంత ప్రశాంత వాతావరణం ఏర్పరిచిందో ఓటర్లు గమనించారు. ఫలితాలు జూన్ నాలుగున రాబోతున్నాయి. ఓటమి ఖాయమనే విషయం వైసీపీ అధినేత తోపాటు, అభ్యర్థులకు కూడా తెలిసిపోయింది. మేము ఎమన్నా తక్కువ తిన్నామా. 2019 లో చంద్రబాబు ఎన్నికల కమిషన్ పై దుమ్మెత్తి పోసాడు. ఇప్పుడు మేము కూడా అదే బాటలో నడుస్తామని వైసీపీ నేతలు బాహాటంగానే అనడం విశేషం. మాకు ఖచ్చితంగా 175 మంది అభ్యర్థులు గెలువబోతున్నారంటూ చంద్రబాబు చేసిన ధీమానే చేయడం విశేషం. దీన్ని వింటున్న రాజకీయ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.

2019 ఎన్నికల సమయం లో కూడా ఏపీ డీజీపీ, చీఫ్ సెక్రటరీ, నిఘా అధికారులను తొలగించి, కొత్త వారికి అవకాశం కల్పించారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారిస్తున్న అధికారులపై కూడా చివరకు ఎన్నికల కమిషన్ కొరడా జరిపించింది. పోలింగ్ నిర్వహణ లో లోపాలను ఎత్తిచూపి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వోటింగ్ మిషన్ మొరాయించాయి. పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైనది. ఈ పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు.

తెలుగు దేశం పార్టీకి ఓటమి భయం పట్టుకొందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మేము అధికారం లోకి రావడం ఖాయమని తేలడంతో , రిగ్గింగ్ చేశామని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మల్లి రీపోలింగ్ చేయాలని కోరుతున్నారు. గతంలో చంద్రగిరిలో కావాలని నాలుగు ప్రాంతాల్లో రీపోలింగ్ ఏర్పాటు చేయించిన టీడీపీ శ్రేణులు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

TAGS