Bhashyam Praveen : గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి : టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్
Bhashyam PraveenBhashyam Praveen : గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కృషి చేయాలని టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కోరారు. శుక్రవారం క్రోసూరు మండలం ఆవులవారి పాలెం, అనంతవరం, విప్పర్ల, బాలమర్తి, అందుకూరు, హసనబాద్, నాగావరం, ఎర్రబాలెం, పీసపాడు ,ఉయందన, 88తాళ్లూరు గ్రామాల్లో ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు.

Bhashyam Praveen
ఈ కార్యక్రమంలో భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల నాయకులు సమన్వయంతో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో సూపర్-6 పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, అన్ని వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి తన గెలుపునకు పాటుపడాలని కోరారు. ఈ సమావేశాల్లో టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల నాయకులు పాల్గొన్నారు.