Rahul Letter : బాధితులకు అండగా ఉండాలి : కర్ణాటక సీఎంకు రాహుల్ లేఖ

Rahul Letter
Rahul Letter : ప్రజ్వల్ రేవణ్ణ కేసులోని బాధిత మహిళలకు అన్ని విధాలా అండగా ఉండాలని కోరుతూ కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘బాధ్యులపై చర్యలు తీసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మహిళలపై హింస జరుగుతుంటే మౌనం వహించే నేతను నేనెప్పుడు చూడలేదు. ప్రధాని మోదీ నేరస్థులకు ఇస్తున్న మద్దతుతో హరియాణాలోని రెజ్లర్ల నుంచి మణిపూర్ లోని అక్కాచెల్లెళ్ల వరకు భారతీయ మహిళలందరూ బలవుతున్నారు’ అని ఆ లేఖలో రాహులు గాంధీ పేర్కొన్నారు.
ఎన్డీయే కూటమి అభ్యర్థిగా హాసన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రజ్వల్ పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించినవిగా చెపుతున్న కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడమే గాక.. బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ప్రజ్వల్ పై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదయింది.