Pranab Mukherjee : నెహ్రూ వల్లే నేపాల్ ను కోల్పోయాం..ఎన్నికల వేళ వైరల్ అవుతున్న ప్రణబ్ పుస్తకంలోని అంశాలు..

Pranab Mukherjee

Pranab Mukherjee-Jawaharlal Nehru

Pranab Mukherjee : భారత దేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ గొప్ప నాయకుడే కాదు గొప్ప ఆర్థికవేత్త కూడా. రాష్ట్రపతి పదవిని అలంకరించకముందు ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ వంటి ప్రధానులతో పనిచేశారు.

వాస్తవానికి ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని పదవిని చేపట్టాలనే కోరిక ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత 2012లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలంలో మొదటి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత మూడు సంవత్సరాలు బీజేపీ పరిపాలించింది.

ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నాయకుడే కాదు మంచి రచయిత కూడా. పలు పుస్తకాలను ఆయన రచించారు. అందులో ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ అత్యంత పాఠకాదరణ పొందింది. ఇందులో ఎన్నో వాస్తవాలను పొందుపరిచారు. ఆయన తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను యథాతథంగా పొందుపరిచారు. అయితే అందులో కొన్ని అంశాలు వివాదస్పదమయ్యాయి. తమను భారత్ ప్రావిన్స్ గా చేయాలన్న నేపాల్ ప్రతిపాదనను ప్రధాని నెహ్రూ తిరస్కరించారని ప్రణబ్ చెప్పడంపై అప్పట్లో కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. నేపాల్ ను భారత్ లో చేర్చుకోవాలని ఆ దేశ రాజు త్రిభువన్ ప్రతిపాదనను నెహ్రూ తోసిపుచ్చడం వల్ల భారత్ కు తీరని నష్టం జరిగిందని ఆయన రాసుకొచ్చారు. ఇది బీజేపీ వాళ్లకు ఒక ఆయుధమైంది. నెహ్రూ వల్లే భారత్ ఎన్నో భూభాగాలను కోల్పోయిందని బీజేపీ నేతలు విమర్శిస్తుంటారు. ప్రణబ్ పుస్తకంలో రాసిన పలు అంశాలను ఇప్పటికీ బీజేపీ సోషల్ మీడియా వైరల్ చేయడం గమనార్హం.

TAGS