JAISW News Telugu

Janasena : మా పొత్తు ‘బలం’  మాకు తెలుసు.. మీ ‘బలహీనత’లూ తెలుసు.. వైసీపీపై జనసైనికుల కౌంటర్ అటాక్


Janasena : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ‘వైనాట్ 175’ అంటూ రెండో సారి గెలవాలనే టార్గెట్ తో  వైసీపీ ముందుకెళ్తోంది. ఈక్రమంలో ఆ పార్టీలో అసంతృప్తుల గొడవలు కూడా ఎక్కువగానే అవుతున్నాయి. దీన్ని కప్పిపెట్టడానికి వైసీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా టీడీపీ, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఆ రెండూ పార్టీలు కలిసి పోటీ చేస్తే తమ పార్టీకి నూకలు చెల్లుతాయనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అందుకే ఆ పార్టీల పొత్తుపై ప్రజల్లో అయోమయం  సృష్టించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు.

టీడీపీ ఇచ్చే పదో, పదహేనో ముష్టి సీట్ల కోసం జనసేనాని పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంటికి వెళ్లారని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. జగన్ తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ రాష్ట్రంలో అమలులో ఉన్నాయని జగన్ ను నెత్తినపెట్టుకున్న అంబటికి జనసైనికుల నుంచి స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ మొదలైంది.

జగన్ చెప్పిన ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దు ఏ రాష్ట్రంలో అమలు చేశారు మంత్రిగారు? ఏపీకి అద్భుతమైన రాజధాని ఎక్కడ నిర్మాంచారు? లేదా మీరు మార్చిన అద్భుతమైన రాజధానిని ఎక్కడ దాచారో కాస్త చూడనిస్తారా సార్? పోలవరం పూర్తిచేసి ఎన్ని నెలలు గడిచాయే చెప్పలరా? మీరు అధికారంలోకి వచ్చాక చేసిన అప్పుల లిస్ట్ చూపిస్తారా? ఇలా కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు.

ఏపీకి రావాల్సిన ‘ప్రత్యేక హోదా’ వైసీపీ ప్రభుత్వం ‘ఎవరికీ ముష్టి వేసిందో’ సమాధానం చెప్పగలరా? అంటూ అంబటి కామెంట్స్ పై జనసైనికులు ప్రశ్నలతో దాడిచేస్తున్నారు. అలాగే జనసేన, టీడీపీ కలిసి ఎన్నికల్లో ముందుకెళ్తే మాకు వచ్చే ‘బలం’ ఏంటో మాకు తెలుసు. అలాగే ఇరుపార్టీల పొత్తు వల్ల మీ పార్టీకి ఉండే ‘బలహీనత’ ఏంటో కూడా మాకు తెలుసు సార్.. అంటూ వైసీపీకి, అంబటికి కౌంటర్ వేస్తున్నారు.

పవన్, చంద్రబాబు ఇద్దరు నేతలకు పొత్తుల మీద ఎంత నమ్మకం ఉందో సీట్ల సర్దుబాటులో కూడా అంతే క్లారిటీ ఉందనేది పవన్ వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. ఇటీవల మంగళగిరి ఆఫీస్ లో మాట్లాడిన పవన్ ఎన్ని సీట్లలో పోటీ  చేస్తాం అన్నది కాదు.. ఎన్ని సీట్లలో విజయం సాధించామనేదే కీలకం అన్నారు. జనసేన విన్నింగ్ పర్సంటేజీ 98 శాతం ఉండాలన్న లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించి ప్రభుత్వంలో భాగస్వామ్యమవుదాం అంటూ ఆకాశానికి నిచ్చెనలు వేయకుండా పవన్ తన లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నెల8 లోపు ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాబు పూర్తిచేసుకుని ప్రజల్లోకి వెళ్లడానికి ఇరు పార్టీల అధినేతలు పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

Exit mobile version