JAISW News Telugu

KTR : కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించాం: కేటీఆర్

FacebookXLinkedinWhatsapp
KTR

KTR

KTR : రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించామని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారని, రైతు భరోసా వేయనందుకు రైతులు కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. అనేక హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. నెలకు రూ.2,500 ఇవ్వలేదని కాంగ్రెస్ పై మహిళలు కోపంతో ఉన్నారని అన్నారు. బీజేపీపై కూడా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ఉందని, పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెంచారని మోదీపై కోపంతో ఉన్నారని పేర్కొన్నారు.

రెండు జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించిందని, మా పార్టీకే అధిక ఎంపీ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోనూ ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదని కేటీఆర్ అన్నారు.

Exit mobile version