JAISW News Telugu

Telangana CM Revanth : తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని పీఎంను కోరాం: తెలంగాణ సీఎం రేవంత్

Telangana CM Revanth

Telangana CM Revanth

Telangana CM Revanth : తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని పీఎం నరేంద్ర మోదీని కోరామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు.. ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలనే ఆలోచనతోనే ప్రధాని, కేంద్రమంత్రులను కలిసినట్లు చెప్పారు. వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న అంశాలపై వినతిపత్రాలు ఇచ్చామన్నారు. కేంద్రం నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ కోరారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో పొందుపర్చిన హక్కులపై పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశామన్నారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ క కేటాయించాలని, రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని, ఐటీఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని కోరినట్లు తెలిపారు. ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని, తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని, జిల్లాకో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని విజ్ఞప్తి చేశామని, పీఎం మోదీ, హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Exit mobile version