Home Minister Anita : అత్యాచారం ఘటనలో నిందితులను 48 గంటల్లో పట్టుకున్నాం: హోం మంత్రి అనిత

Home Minister Anita
Home Minister Anita : శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారం ఘటనలో నిందితులను 48 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారని ఏపీ హోం మంత్రి అనిత తెలిపారు. వారికి వేగంగా శిక్ష పడాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. దీనిపై విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో ప్రజల భాగస్వామయ్యం ఉండాలని కోరుతున్నామన్నారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలను పోలీసు శాకకు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ సాధ్యమవుతుందని హోం మంత్రి పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రజలు నేర నియంత్రణకు సహకరించాలని కోరారు.