AP Voters : ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఉండే వలస ఓటర్లకు వారితో తరచూ ఫోన్లు చేయించారు. ఊరికి వచ్చి ఓటేయాలని, రానుపోనూ రవాణా ఖర్చులతోపాటు ఓటుకు కొంత ఇస్తామని వారితో హామీ ఇప్పిస్తున్నారు. దీంతో నగరంలో ఉండే దినసరి కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు ఓటింగ్ రోజున సొంతూర్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఏపీలో అరాచక పాలనను మార్చేందుకు జనాలు కంకణం కట్టుకున్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న వారే కాదు..విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈసారి ఎలాగైనా ఓటు వేసి జగన్ పాలనకు చరమగీతం పాడాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఈసారి రికార్డు స్థాయిలో ఆంధ్రా బయట ఉన్న ఏపీ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. జగన్ రెడ్డి ఐదేండ్ల పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ ఒకే నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దాదాపు 20లక్షల మందికి పైగా ఓటర్లు కిక్కిరిసినన రైళ్లు, బస్సుల్లో ప్రయాణమయ్యారు. అందరిలో ఒకే మాట..సైకిల్ గుర్తుకు ఓటు వేస్తాం.. చంద్రబాబును గెలిపిస్తాం..!
175 సీట్లు గెలిపిస్తామని ప్రగాల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎన్నికల నాటికి కనీసం 25 సీట్లన్నా గెలుస్తారా? అనే పరిస్థితికి పడిపోయింది. రాష్ట్రానికి ఐదేండ్లలో జరిగిన అన్యాయానికి రివేంజ్ తీసుకునేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. అందుకే ఎవరినీ అడిగినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఓటు వేస్తామని అంటున్నారు. గతంలో ఏపీలో ఓటు వేయడానికి వచ్చేందుకు వివిధ నగరాల్లో ఉండేవారు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు..ఈ ఎన్నికలు రాష్ట్రానికే కాదు ప్రతీ ఒక్కరికి కీలకం కావడంతో తమకై తాము వచ్చి ఓటు వేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకోకుంటే రాష్ట్రం మరింత అధోగతి పాలవుతుందని, అలాగే పిల్లల భవిష్యత్ కు భరోసా ఉండదనే భయంతో ప్రతీ ఒక్కరూ ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. దార్శనికుడు చంద్రబాబును సీఎంగా చేయడమే తమ లక్ష్యంగా తండోపతండాలుగా రాష్ట్రానికి తరలివస్తున్నారు.